2023 ఎన్నికల్లో 64 సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నుండి సీఎం విషయంలో ఎన్నో చర్చలు జరిగి చివరికి పార్టీని అధికారంలోకి వచ్చేలా విశ్వ ప్రయత్నాలు చేసిన రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) కే కాంగ్రెస్ అధిష్టానం పట్టం కట్టి చివరికి ఆయనను సీఎం చేశారు.అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చాలామంది బీఆర్ఎస్ ( BRS ) నేతలు కాంగ్రెస్ పార్టీ కేవలం సంవత్సరం కూడా అధికారంలో ఉండలేదు.
మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే అంటూ చెబుతున్నారు.అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు.
బీఆర్ఎస్ నేతలు ఇలా చెప్పడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ లో చాలామంది నేతలు ఎప్పుడూ ఏ విషయంలో అలుగుతారో తెలియదు.అంతేకాకుండా కాంగ్రెస్ కి వచ్చిన మెజారిటీ భారీది ఏం కాదు.

ఒకవేళ కెసిఆర్ ( KCR ) తన చాణిక్య తెలివితో డబ్బులతో కొంతమంది ఎమ్మెల్యేలను కొని మళ్లీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా కూడా ఉంది.అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డికి కొత్త భయం స్టార్ట్ అయిందట.అందుకే కెసిఆర్ బాటలో ఆయన కూడా కొంతమంది ఎమ్మెల్యేలను కొని పూర్తి మెజారిటీతో తన పార్టీని కాపాడుకోవాలని,మరీ ముఖ్యంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి అని చూస్తున్నారట.

అయితే ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ ( Congress ) గెలుపొందితే ఒకటి,రెండు స్థానాలలో బీఆర్ఎస్ గెలుపొందింది .ఇక ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కొనాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.ఇక ఆ ఎమ్మెల్యేలను కొని పూర్తి మెజారిటీతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.
ఇక గతంలో కూడా కేసీఆర్ ఇలాంటి పనే చేశారు.కేసీఆర్ మాత్రమే కాకుండా చంద్రబాబు (Chandrababu naidu ) కూడా వైసిపిలో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలను కొన్నప్పటికీ ఆయనకు ఫలితం దక్కలేదు.
అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా తమ పరిపాలన ఎలా ఉంటుందో ప్రజలకు చూపించాలని అనుకుంటున్నారట.మరి కెసిఆర్ లాగే రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలను కొని తమ పార్టీకి పూర్తి మెజారిటీని తెచ్చుకొని పాలన చేస్తారా లేక ఉన్నవారితోనే సర్దుకుపోతారా అనేది చూడాలి