మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్.. 100 కి.మీకి కేవలం 5 రూపాయలే ఖర్చు..!

టెస్లా ఎలక్ట్రిక్ కార్లు సక్సెస్ అయిన తర్వాత ప్రపంచమంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపే అడుగులు వేస్తున్నాయి.ముఖ్యంగా మన ఇండియాలో ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ ఎత్తున అందుబాటులోకి వస్తూ చాలామంది రవాణా ఖర్చులను తగ్గించేస్తున్నాయి.

 A New Electric Bicycle In The Market.. The Cost Of 100 Km Is Only 5 Rupees.. Tra-TeluguStop.com

స్కూటర్లు మాత్రమే కాదు కార్లు, బైకులు, సైకిల్స్ కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌లలో రిలీజ్ అవుతూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి.ఈ నేపథ్యంలోనే భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన ప్లాట్‌ఫామ్ అయిన ఈబైక్‌గో (eBikeGo) Transil e1 పేరుతో ఒక అద్భుతమైన సైకిల్‌ను ఇండియాలో లాంచ్ చేసింది.

ఈ సైకిల్ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Electric Bike, Cruise Mode, Ebikego, Electric Cycle, Smart Battery, Trans

ఈబైక్‌గో తన B2C వర్టికల్, ట్రాన్సిల్ కింద ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది.ట్రాన్సిల్ e1 సైకిల్ ప్రీ-బుకింగ్స్‌ త్వరలో ప్రారంభమవుతాయి.దీని ధరను రూ.44,999గా నిర్ణయించింది. ఇ-సైకిల్ తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం తీసుకొచ్చారు.

ఇందులో యునిసెక్స్ స్టీల్ ఫ్రేమ్, సింగిల్-స్పీడ్ ట్రాన్స్‌మిషన్, మెరుగైన పనితీరు కోసం స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన Li-Ion బ్యాటరీ ఉన్నాయి.

Telugu Electric Bike, Cruise Mode, Ebikego, Electric Cycle, Smart Battery, Trans

ఈ బైక్ తేలికైన, దృఢమైన ఫ్రేమ్‌తో వస్తుంది.దీని మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ.నీటిలో తడిచినా ఈ సైకిల్ కి ఏమీ కాదని కంపెనీ చెబుతోంది.

ట్రాన్సిల్ e1 సింగిల్ ఛార్జ్‌కి 20-40 కిమీ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది.ప్రతి ఛార్జ్‌కు 0.18 యూనిట్లను వినియోగిస్తుంది.అంటే ఆరుసార్లు ఛార్జ్ చేస్తే ఒక యూనిట్ కరెంట్ కాలుతుంది.

అంటే సుమారు 5 రూపాయలు.ఈ ఐదు రూపాయలతోనే దీన్ని కొన్నవారు ఈజీగా 100 కిలోమీటర్లు జరగొచ్చు.ఇకపోతే దీనిని 2-2.5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు.ఇది పెడల్ అసిస్ట్, క్రూయిజ్ మోడ్, థొరెటల్‌తో సహా అనేక రకాల మోడ్‌లను కూడా కలిగి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube