విశాఖలోని మధురవాడ ఐటీ హిల్స్ వద్ద ఫ్లెక్సీల కలకలం చెలరేగింది.రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.
జనజాగరణ సమితి పేరుతో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిసినట్లు తెలుస్తోంది.అయితే సీఎం జగన్ రేపు విశాఖతో పాటు విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఇందులో భాగంగా ఐటీ హిల్స్ అదానీ డేటా సెంటర్ కు జగన్ శంకుస్థాపన చేయనున్నారు.జగన్ పర్యటన నేపథ్యంలో వెలసిన ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.







