హైదరాబాద్ లో రెండో రోజు జరుగుతున్న ఇండియన్ కార్ రేసింగ్ లీగ్ లో పెను ప్రమాదం తప్పింది.ఎన్టీఆర్ మార్గ్ లో చెన్నై టర్బో రైడర్స్ మహిళా రేసర్ కు ప్రమాదం జరిగింది.
క్వాలిఫైయింగ్ -1 రేసులో గోవా ఏసెస్ రేసింగ్ కారు చెన్నై టర్బో రైడర్స్ రేసింగ్ కారును ఢీకొట్టడంతో ఘటన చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో మహిళా రేసర్ కు స్వల్ప గాయాలు కావడంతో హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు.