సాధారణంగా హోటల్స్ లేదా రెస్టారెంట్స్‌లో భోజనం చేస్తే వేలలోనే బిల్లు అవుతుంది.అయితే అబుదాబిలోని ఓ రెస్టారెంట్‌లో ఒక కస్టమర్‌కు బిల్లు అక్షరాలా 6,15,065 దిర్హమ్స్ అయింది.భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.1.36 కోట్లు.అంటే ఈ డబ్బుతో లగ్జరీ కారే కొనుగోలు చేయవచ్చు.5 డిష్‌లు తిన్నందుకే ఇంత బిల్లు కావడం ఇప్పుడు అందర్నీ షాక్‌కి గురిచేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.ప్రముఖ టర్కీస్ చెఫ్ సాల్ట్ బే అలియాస్ నుస్రెట్ గోక్సే గల్లెరియాలోని ఒక రెస్టారెంట్‌లో స్పెషల్ డిషెస్ తయారు చేస్తున్నాడు.కాగా వీటిలో 5 డిషెస్ ఆర్డర్ చేసిన కస్టమర్ రూ.1.36 కోట్లు చెల్లించుకున్నాడు.ఆ ఆర్డర్‌లో ఐదు బాటిళ్ల పెట్రస్ ఉండగా వాటి ఖరీదు రూ.72.13లక్షలు అయింది.అలానే అతడు 2009 స్టైల్ పెట్రస్‌ను రెండు బాటిళ్లు ఆర్డర్ చేశాడు.వీటి ధర ఏకంగా రూ.44.38 లక్షలు.అలానే వ్యాట్ రూ.6.40లక్షలు, ఇంకొన్ని ఫుడ్ ఐటెమ్స్ కలిపి టోటల్ బిల్లు రూ.1.36కోట్లు అయింది.ఇంత బిల్ అయినా సరే కస్టమర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ కావడం మరో విశేషం.ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆ డబ్బే పేదలకు ఇస్తే వాళ్లు పదేళ్లపాటు హాయిగా కడుపు నింపుకుంటారు.
ఇలాంటి ఖరీదైన ఫుడ్ తినడం అవసరమా అని ఇంకొందరు పెదవి విరుస్తున్నారు.సాల్ట్ బేగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన చెఫ్ నుస్రెట్ గోక్సే మంసాన్ని చాలా కొత్తగా కట్ చేస్తాడు.
అలానే అతడు ఉప్పును కూడా ఆహార పదార్థాలపై చాలా కొత్తగా, యూనిక్‌గా చిలకరిస్తాడు.అంతేకాదు, ఇంకా అతను కుకింగ్ స్టైల్ వేరేలా ఉంటుంది.







