కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్పకు( Nimmakayala Chinarajappa ) ప్రమాదం తప్పింది.శనివారం చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ టీడీపీ.
జనసేన కూటమికి సంబంధించి తొలి జాబితా ప్రకటన చేయటం తెలిసిందే.ఈ ప్రకటనలో పెద్దాపురం ఎమ్మెల్యేగా( Peddapuram MLA ) మూడోసారి నిమ్మకాయల చినరాజప్పకు టికెట్ దక్కింది.
దీంతో పెద్దాపురంలో స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్నరాజప్ప అనుచరులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.అయితే ర్యాలీ జరుగుతుండగా సరిగ్గా దర్గా సెంటర్ వద్ద ఓ వ్యక్తి అకస్మాత్తుగా రోడ్డు మీదకు రావడంతో డ్రైవర్ ఆ వ్యక్తిని తప్పించే ప్రయత్నం చేయగా కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీకొనడం జరిగింది.
ఈ ఘటన జరిగిన సమయంలో కారులోనే చినరాజప్ప ఉన్నారు.కానీ ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.2014 మరియు 2019 ఎన్నికలలో పెద్దాపురం నియోజకవర్గం నుండి నిమ్మకాయల చినరాజప్ప రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది.మరోసారి ఆయనకే తెలుగుదేశం టికెట్ కేటాయించటంతో.స్థానిక టీడీపీ నేతలు( TDP Leaders ) భారీ ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది.2024 ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) భావిస్తున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్తపడి జనసేనతో పొత్తు పెట్టుకోగా మరోపక్క బీజేపీతో కూడా కలిసి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు.ఈ క్రమంలో 2014లో కూటమి విజయం సాధించినట్లు 2024 ఎన్నికలలో విజయం సాధించాలని చంద్రబాబు ఆలోచన చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.