తెలుగు రాష్ట్రాల్లో నీరు పుష్కలంగా ఉంటుంది.ఏవైనా మెట్టప్రాంతాల్లోనో, భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాల్లోనే తప్పితే అన్ని చోట్ల తాగునీరు, సాగు నీరు అవసరమైనంత మేర లభిస్తుంది.
నదులు, సరస్సులు, చెరువులు, జలాశయాలు ఉండడంతో మనకు నీటికష్టాలు అంతగా తెలియవు.అయితే వేసవి వస్తే మాత్రం ప్రజలంతా దాహంతో అల్లాడిపోతుంటారు.
ఇంట్లో ఉండే ఫ్రిజ్‌లోని నీటితో గొంతు తడుపుకుని ఉపశమనం పొందుతారు.రోడ్డు మీద వెళ్తున్న వారైతే దగ్గర్లో కనపడిన షాపులకు వెళ్లి కూల్ డ్రింక్ తాగి దాహం తీర్చుకుంటారు.
అయితే నోరు లేని మూగజీవాల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంటుంది.కొన్ని పక్షులు ఎండ వేడిమికి తాళలేక, గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు లేక ప్రాణాలను వదిలేస్తున్నాయి.
దేశమంతటా ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి.40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఈ క్రమంలో ఓ పక్షి రోడ్డుపై పడిపోయి గిలాగిలా కొట్టుకుంది.చుక్క నీరు కూడా లేక చివరికి ప్రాణాలు వదిలే పరిస్థితికి చేరుకుంది.ఆ సమయంలో ఓ వ్యక్తి అక్కడకు వచ్చాడు.ఆ పక్షి పరిస్థితి చూసి చలించిపోయాడు.
తన వద్ద ఉన్న వాటర్ బాటిల్‌లో నుంచి కొంచెం నీరు మూతలో వేసి ఆ పక్షికి తాగించారు.గబగబా ఆ నీటిని తాగిన పక్షి ప్రాణాలను నిలుపుకుంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పక్షికి వాటర్ తాగిస్తున్న వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ట్విట్టర్‌లో ఆయన పెట్టిన వీడియోకు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు వస్తున్నాయి.అయితే ఆయన ఓ సందేశాన్ని అందులో ఉంచారు.పక్షుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని, వీలు లేకుంటే చిన్న పాత్రలో నీరు పోసి ఆరు బయట పెట్టాలని కోరారు.ఇది ఎన్నో పక్షుల ప్రాణాలను నిలుపుతుందని సుశాంత నంద కోరారు.
దీనికి నెటిజన్లు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.