మంత్రి మల్లారెడ్డి టార్గెట్ వెనుక భారీ కసరత్తు ?

గత రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా ఐటి,  ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.భారీగా అక్రమ ఆస్తుల గుర్తించినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

 A Huge Exercise Behind The Target Of Minister Mallareddy ,minister Mallareddy, T-TeluguStop.com

మొత్తం ఈ దాడులలో 400 మంది అధికారులు 65 బృందాలుగా ఏర్పడి మల్లారెడ్డి బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్ళ పై దాడులకు దిగి సోదాలు నిర్వహిస్తున్నారు.ఈ సోదాలు మరికొన్ని రోజులపాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే మల్లారెడ్డి నివాసం తో పాటు, ఆయన కొడుకులు , అల్లుడు , బంధువులు , మల్లారెడ్డి ఇల్లు,  విద్యాసంస్థలు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

గత పదేళ్లుగా మల్లారెడ్డి చెల్లించిన ఐటి రిటర్న్స్ పైన అధికారులు ఆరా తీస్తున్నారు.ఇప్పటివరకు జరిపిన సోదాల్లో మంత్రి సన్నిహితుల నుంచి 8.80 కోట్ల నగదుతో పాటు,  కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.మరో రెండు రోజులు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.అయితే ఇంత పెద్ద మొత్తంలో దాడులు జరుగుతున్నా,  టిఆర్ఎస్ కు చెందిన కొంతమంది నేతలు మినహా,  పెద్దగా ఎవరు స్పందించడం లేదు.

అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించడం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని , చాలాకాలంగా ఆయన ఆర్థిక వ్యవహారాలు, వ్యాపార కార్యకలాపాల పైన,  బంధువులు , సన్నిహితుల కార్యకలాపాల పైన పూర్తిస్థాయిలో నిఘా పెట్టి పక్కాగా ఆధారాలు సంపాదించిన తర్వాతే ఈ దాడులకు దిగినట్లు సమాచారం.
 

Telugu Central, Malla, Trs-Political

ముఖ్యంగా కొద్ది నెలలు క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా వేషం మార్చి ఐటి అధికారులు మల్లారెడ్డి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి ఆధారాలను సేకరించినట్లు సమాచారం.ఈ విధంగా రకరకాల మార్గాల్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకుని అన్ని లావాదేవీల్లోనూ లొసుగులు ఉన్నట్లుగా భావించిన తర్వాతనే ఐటి అధికారులు ఈ దాడులకు దిగినట్లు తెలుస్తోంది.భారీగా నగదు స్వాధీనం మంగళవారం నిర్వహించిన ఐటీ దాడుల్లో మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువుల ఇల్లు కార్యాలయాల్లో దాదాపు 4.80 కోట్లను స్వాధీనం చేసుకోగా నిన్న నాలుగు కోట్లను స్వాధీనం చేసుకున్నారు అలాగే మంగళవారం త్రిశూల్ రెడ్డి ఇంట్లో  2.80 కోట్లు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో రెండు కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube