మిస్టర్ బచ్చన్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన యంగ్ హీరో.. నటనతో అదుర్స్ అనిపించాడుగా!

ఇటీవల కాలంలో సినిమాలలో గెస్ట్ అప్పీరెన్స్ లు ఇవ్వడం అన్నది ట్రెండ్ అయిపోయింది.

ఒక హీరో సినిమాలో మరొక హీరో అతిథి పాత్రలో నటించి ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు.

ఒక హీరో సినిమాల్లో మరొక హీరో ని చూపిస్తూ సినిమాలపై ఉన్న హైప్ ని మరింత పెంచుతున్నారు.తాజాగా మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ఒక యంగ్ హీరో గెస్ట్ పాత్రలో నటించారు. హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వంలో రవితేజ( Ravi Teja ) హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా( Mr.Bachchan movie ) తాజాగా థియేటర్స్ లో రిలీజ్ అయింది.

కానీ నిన్న సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు వేశారు.ఈ సినిమా పై మిక్స్‌డ్ టాక్ వస్తోంది.అయితే ఈ సినిమాలో ఇద్దరు స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.

Advertisement

డీజే టిల్లు సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ( Sidhu Jonnalagadda ) సెకండ్ హాఫ్ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి ఒక ఫైట్ చేసి కొన్ని డైలాగ్స్ తో అదరగొట్టాడు.ఆ మాస్ మహారాజ కోసం ఈ యూత్ యువరాజ్ వచ్చాడు అనే డైలాగ్ థియేటర్స్ లో బాగా పేలింది.

ఈ డైలాగ్ తో థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది.సినిమా రిలీజ్ కి ముందే యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తాడని వైరల్ అయింది.

ఇప్పుడు సినిమాలో సిద్ధు ని చూసి ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతున్నారు.అయితే సిద్ధుకి, రవితేజకి కలిపి ఒక సీన్ ఉంటే బాగుండేది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అలాగే ఈ సినిమాలోని ఒక సాంగ్ లో దేవిశ్రీ ప్రసాద్( Devishri Prasad ) అలా కనిపించి ఇలా మాయమయ్యే సరదా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు.

మిక్కీ జె మేయర్ సంగీతం ఇచ్చిన ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం విశేషం.ఇకపోతే తాజాగా విడుదలైన మిస్టర్ బచ్చన్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు సినిమా థియేటర్లకు క్యూ కడుతున్నారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు