Heinz B : కోట్ల ఆస్తి ఉన్నా చెత్తలో దొరికే ఆహారాన్ని తింటున్న జర్మన్ వ్యక్తి.. ఎందుకంటే…

సాధారణంగా డబ్బులు ఉంటే చాలా మంది ఖరీదైన కార్లు, బట్టలు, రాజ భవనాల లాంటి ఇల్లు కొనుగోలు చేస్తూ ఉంటారు.వారు దర్జాగా బతుకుతుంటే పేద, మధ్యతరగతి ప్రజలు అసూయ పడుతుంటారు.

 A German Man Who Has Billions Of Dollars And Eats Junk Food Because-TeluguStop.com

అయితే కొందరు ధనవంతులు చాలా డబ్బు ఉన్నా పేదవారి లాగానే బతుకుతారు.ఇతరులను మెప్పించడానికి ఇలా చేయరు, వారికి సింపుల్ గా నివసించడం అంటేనే ఇష్టం.

ఆ కోవలోకే వస్తాడు హెన్జ్ బి ( Heinz B )అనే జర్మన్‌ వ్యక్తి.డార్మ్‌స్టాడ్ట్‌కు( Darmstadt ) చెందిన ఈ 80 ఏళ్ల వృద్ధుడు చాలా ధనవంతుడు.

అతనికి ఏడు ఇళ్ళు, రెండు అపార్ట్‌మెంట్లు ఉన్నాయి, అయినా పేదోడిగా నివసిస్తున్నాడు.

హెన్జ్ బి టెలికమ్యూనికేషన్స్ ( Telecommunications )పరిశ్రమలో సీనియర్ అధికారిగా పని చేసేవాడు.

ఇప్పుడు అతనికి ప్రతి నెలా 3,600 యూరోల పెన్షన్ వస్తుంది.కానీ అతను తన బ్యాంకు ఖాతాలో 12 యూరోలు మాత్రమే ఉంచుకుంటాడు, తన కోసం చాలా తక్కువ ఖర్చు చేస్తాడు.

అతను ఇటీవల మరొక ఆస్తిని కొనుగోలు చేయడానికి 700,000 యూరోలు తీసుకున్నాడు, కానీ రోజువారీ జీవితంలో ఎక్కువ ఖర్చు చేయడు.

Telugu Germandollars, Darmstadt, Waste, Frugal, Germany, Heinz, Simple-Telugu NR

ఆహారాన్ని కొనుగోలు చేసెంత ఆర్థిక స్తోమత ఉన్నా, హీన్జ్ బి ఇతర వ్యక్తులు పారేసిన ఆహారాన్ని తినడానికే ఇష్టపడతాడు.ఇది డబ్బును ఆదా చేస్తుందని అతను అంటున్నాడు.ఆహారాన్ని ఎవరూ వృధా చేయకూడదని పేర్కొంటున్నాడు.

కొన్నిసార్లు, అతను వంట నూనెను కొనుగోలు చేస్తాడు, కానీ ఎక్కువగా చెత్తలో దొరికిన వాటిని తింటాడు.

Telugu Germandollars, Darmstadt, Waste, Frugal, Germany, Heinz, Simple-Telugu NR

హీన్జ్ పొరుగువారికి అతని అలవాట్లు గురించి తెలుసు, వారు కొన్నిసార్లు అతనికి ఆహారం ఇస్తారు, అతను తన కోసం డబ్బు లేదా వస్తువులను కొనడం గురించి పెద్దగా పట్టించుకోడు.చిన్న తనంలో ఇలాంటి జీవితాన్నే తాను అనుభవించాలని చెబుతున్నాడు.అందుకే ఇప్పటికి అలానే జీవించడానికి ఇష్టపడుతున్నానని మీడియాకి తెలిపాడు.

హీన్జ్ జీవన విధానం గురించి తెలుసుకుని చాలామంది ఆశ్చర్యపోతున్నారు, డబ్బు, వనరులను వృధాగా ఖర్చు చేయకుండా బతుకుతున్న ఈ వ్యక్తిని చాలామంది పొగుడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube