చిన్నపిల్లలు పాటలు పాడుతుంటే, లేదంటే డ్యాన్స్ చేస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది.ఈ చిన్నారులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజలను ఆకర్షిస్తుంటాయి.
తాజాగా అలాంటి ఒక వీడియో వైరల్ గా మారి ఆన్‌లైన్‌లో మిలియన్ల మంది హృదయాలను కొల్లగొట్టింది.ఇందులో అజర్‌బైజాన్‌కు( Azerbaijan ) చెందిన ఒక చిన్నారి సంప్రదాయ నృత్యం( Traditional dance ) చేస్తోంది.
ఈ బాలిక ఆ ఫోక్ సాంగ్‌కి అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేసింది.ఈ బాలిక స్టెప్స్ చాలా గ్రేస్ ఫుల్ గా ఉన్నాయి.

ఆమె స్నేహితులు కూడా అక్కడ ఉన్నారు, వారు చప్పట్లు కొడుతూ, నృత్యం చేస్తూ, వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు.అమ్మాయి చిరునవ్వులు చిందిస్తూ అద్భుతంగా డాన్స్ చేసింది.అందుకే చాలామంది ఆ చిన్నారిని చూసి ఫిదా అవుతున్నారు.@TheFigen అనే ఎక్స్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.అమ్మాయి పర్ఫామెన్స్, ఆమె చుట్టూ ఉన్నవారికి అలాంటి ఆనందాన్ని కలిగించే ఆమె సామర్థ్యానికి నెటిజన్లు వావ్ అంటున్నారు.ఈ చిన్నారి చాలా టాలెంటెడ్ అని పేర్కొంటున్నారు.

ఇలాంటి వీడియో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు.జనవరిలో ఓ స్కూల్ ఈవెంట్‌లో విద్యార్థిని ఎంతో ఉత్సాహంతో డ్యాన్స్ చేయగా.ఆమె వీడియో కూడా వైరల్ గా మారి చాలామందిని ఆకట్టుకుంది.ఈ బాలిక తమిళ సినిమాలోని పాటకు డ్యాన్స్ చేస్తూ అదిరిపోయే ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది.ఆ వీడియోకు కూడా భారీ మొత్తంలో లైక్‌లు వచ్చాయి.ఆనందాన్ని వ్యక్తీకరించడానికి, ఇతరులతో కనెక్ట్ కావడానికి నృత్యం ఎలా శక్తివంతమైన మార్గంగా ఉంటుందో ఇలాంటి వీడియోలు చెప్పకనే చెబుతాయి.







