కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరంలేదు.తాజాగా ట్విట్టర్ లో ఆయన తన అభిమానులతో ఓ శుభవార్త పంచుకున్నాడు.
అదేమిటంటే, నిన్న అనగా మంగళవారం ఓ మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిపాడు.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిన్నారి కుమారుడిని చేతుల్లోకి తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు.
అతని చేతుల్లోని బాబు చాలా క్యూట్ గా, ప్లెజెంట్ గా వున్నాడు.ఈ సందర్భంగా అభిమానులు షెల్డన్ జాక్సన్ దంపతులకు శుభాకాంక్షల వెల్లువతో ముంచెత్తుతున్నారు.
KKR సైతం లిటిల్ నైట్‌కు క్లబ్‌లోకి స్వాగతం అంటూ జాక్సన్‌ను విష్ చేయడం కొసమెరుపు.
ఇకపోతే దేశవాళీ క్రికెట్‌లో రాణించినప్పటికీ 35 ఏళ్ల షెల్డన్ జాక్సన్‌కు ఇంత వరకు టీమిండియాలో చోటు దక్కడపోవడం దురదృష్టకరం.
దీంతో తాను తీవ్ర నిరాశకు గురైనట్లు జాక్సన్ గతంలో పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి విదితమే.ఒకానొక సమయంలో తాను ఈ విషయం గురించి ఒకరిద్దరిని అడుగగా.
తనకు వయసైపోయిందన్నారని, అందుకే BCCI నుంచి పిలుపు రావడం లేదన్నారని పేర్కొన్నాడు.అయితే, అదే సమయంలో 30 ఏళ్లు పైబడిన వారిని జట్టుకు ఎంపిక చేయడం చూశానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా, 2011లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన షెల్డన్ జాక్సన్ 79 మ్యాచ్‌లు ఆడి 5947 పరుగులు సాధించాడు.ఇందులో 19 సెంచరీలు ఉన్నాయి.ఇక లిస్ట్ ఏ క్రికెట్‌లో 67 మ్యాచ్‌లలో 2346 పరుగులు చేశాడు.అదే విధంగా పొట్టి ఫార్మాట్‌లో 1534 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు.ఇందులో సెంచరీ కూడా ఉండటం గొప్ప విషయం.ఇక IPLలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు షెల్డన్ జాక్సన్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి విదితమే.