పాముకు ముద్దు పెట్టిన తాగుబోతు.. చివరికి ఏమైందంటే

మద్యం మత్తులో చాలా మంది విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.తీరా మత్తు వదిలాక చాలా అమాయకంగా కనిపిస్తారు.

అయితే మద్యం మత్తులో కొందరు చేసే వింత పనులు వారి ప్రాణాల మీదకు తీసుకొస్తాయి.తాజాగా ఇలాంటి ఘటన యూపీలోని దేవరియాలో జరిగింది.

మద్యం మత్తులో పామును మెడలో పెట్టుకుని ఆడుకోవడం వల్ల ఓ వ్యక్తి చనిపోయాడు.ఆ వ్యక్తి తన మెడకు పాము చుట్టుకుని తనను తాను భోలేనాథ్( Bholenath ) తండ్రి అని భావించాడు.

తనను పదే పదే కాటు వేయమని పామును సవాలు చేశాడు.తీరా పాము కాటువేయడంతో అతడు మృతి చెందాడు.

Advertisement
A Drunkard Who Kissed A Snake What Happened In The End, Snake, Viral Latest, New

ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

A Drunkard Who Kissed A Snake What Happened In The End, Snake, Viral Latest, New

ఖుఖుండు పోలీస్ స్టేషన్( Khukhundu Police Station ) పరిధిలోని అహిరౌలి గ్రామంలో( Ahirauli village ) రోహిత్ జైశ్వాల్ ( Rohit Jaishwal )అనే యువకుడు ఉండే వాడు.అతడికి 22 సంవత్సరాలు.అతని తల్లిదండ్రులు సిలిగురిలో నివసిస్తున్నారు.

అతడికి ఆరుగురు సోదరులు, సోదరీమణులు ఉన్నారు.అందరిలోనూ రోహిత్ చిన్నవాడు.

వైరల్ అవుతున్న వీడియోలో, మద్యం తాగిన ఆ యువకుడు నేను భోలేనాథ్ తండ్రిని అని చెబుతున్నాడు.ఆ తర్వాత అతను పాముతో ఆడుకున్నాడు.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
జర్మనీ బీచ్‌ల‌లో షాకింగ్ రూల్స్.. బట్టలు వేసుకుంటే ఇక గెంటేస్తారట..?

ఒక్కోసారి పామును మెడకు చుట్టుకున్నాడు.ఇంకో సందర్భంలో పామును ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు.

A Drunkard Who Kissed A Snake What Happened In The End, Snake, Viral Latest, New
Advertisement

ఆ పాము తన మాటలు వినడం లేదని కొట్టడానికి ప్రయత్నించాడు.అయితే ఆ విష సర్పం బుసలు కొడుతూనే ఉంది.చివరికి ఆ పాము అతడిని కాటు వేసింది.

దీంతో ఆ యువకుడు చనిపోయాడు.మృతుడి పేరు రోహిత్ జైస్వాల్.

ఈ ఘటన శనివారం రాత్రి జరిగినట్లు సమాచారం.పాము కాటు వల్లే యువకుడు చనిపోయాడని ఖుఖుండు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సంతోష్ కుమార్ సింగ్ మీడియాకు వివరించారు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.యువకుడు తాను చనిపోయే వరకు ఆ పాముతో ఆటలాడాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా వార్తలు