వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్నట్లుగా తెలంగాణ ఎన్నికల్లో( Telangana Elections ) విపరీతంగా కష్టపడినా షర్మిల పార్టీకి సరైన గుర్తింపు రాలేదు, పోనీ కాంగ్రెస్లో విలీనం ద్వారానైనా తన రాజకీయ ఆకాంక్షలు తీర్చుకుందామని ప్రయత్నిస్తే రేవంత్ రెడ్డి( Revanth Reddy ) వర్గం అడ్డుకోవడంతో అది కూడా ముందుకు కదలలేదు.దాంతో షర్మిల( YS Sharmila ) తీవ్ర ఆగ్రహంతోను, ఆవేదనతో ఉన్నట్లుగా ఆమె మీడియా ముఖంగా చేస్తున్న వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి.
అన్ని పార్టీలలోనూ దొంగలు ఉంటారని, అయితే దొంగలకు ముఖ్యమంత్రి పదవి కాకూడదు రాకూడదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి పై ఆగ్రహంతో చేసినవేనని ప్రచారం జరుగుతుంది.
మరోవైపు వైఎస్ కుటుంబానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ కు షర్మిల మద్దతు ఇవ్వడం అంత మంచిది కాదని అభిప్రాయపడిన వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి పై( Sajjala Ramakrishna Reddy ) కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అసలు తన పార్టీతో సంబంధం లేదు అని పార్టీ పెట్టినప్పుడే ప్రకటించిన పెద్ద మనుషులు ఇప్పుడు తన పార్టీ గురించి, తన నిర్ణయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలంటూ ఆమె నిలదీశారు.

సంబంధం లేదన్న వారు ఇప్పుడు సంబంధం కలుపుకోవాలి అనుకుంటున్నారా అంటూ ఆమె ప్రశ్నించారు.ఒకవైపు కేసీఆర్( KCR ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తుంటే మాట్లాడకుండా తన గురించి మాట్లాడడం చిత్రంగా ఉందన్నారు.ఆంధ్రాలో సింగిల్ రోడ్లు, తెలంగాణలో డబుల్ రోడ్లు, ఆంధ్రలో చీకటి ,తెలంగాణలో వెలుగంటూ బహిరంగంగా ఆంధ్రా ప్రభుత్వాన్ని కేసీఆర్ దుమ్మెత్తి పోస్తుంటే సజ్జల ఏమని సమాధానం చెబుతారు? అంటూ నిలదీశారు.

మీ పని మీరు చూసుకోండి అంటూ ఘాటుగా వాఖ్యనించారు.అయితే సజ్జల మాట్లాడితే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి( CM Jagan ) మాట్లాడినట్టే కదా అంటూ అడిగిన విలేకరుల ప్రశ్నలకు ఎవరికైనా ఇదే సమాధానం చెబుతాను అంటూ ఆమె సమాధానం చెప్పారు.అయితే వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఏకైక మహిళా రాజకీయ నేత గా పేరు సంపాదించుకున్నప్పటికీ, తన రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం లో మాత్రం ఆమె విపలమయ్యారు.అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశం గురించి ప్రస్తుతానికైతే ఆమె నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు.