గొర్రెల మందలో దాక్కున్న కుక్క.. అసలు అనుమానం రాకుండా ఏం చేసిందంటే..?

గొర్రెల మందలో( sheep ) ఒక కుక్క తెలివిగా దాక్కుంది.దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

 A Dog Hiding In A Herd Of Sheep What Did It Do Without Suspicion , Dog, Goats, V-TeluguStop.com

ఈ వీడియోను చూసిన నెటిజన్లు కుక్క తెలివి మాములుగా లేదని, అనుమానం రాకుండా భలే దాక్కుందని కామెంట్స్ పెడుతున్నారు.ఈ కుక్కను సీఐఏ ఏజెంట్ గా కొంతమంది అభివర్ణిస్తున్నారు.

రోడ్లపై గొర్రెల మంద వెళుతుండటం మనం చూస్తూ ఉంటాం.అలాగే పొలాల్లో గడ్డి మేసేటప్పుడు ఒకేచోట గుంపుగా గొర్రెలు ఉంటాయి.

అలాంటి ఒక గొర్రెల మందలోకి కుక్క చొరబడింది.వాటికి తెలియకుండానే సైలెంట్ గా గొర్రెల మందలోకి దూరిపోయింది.

ఈ వీడియోలో గొర్రెల మందలో కుక్క కూర్చుంది.ఈ కుక్క( dog ) చూడటానికి కాస్త గొర్రెలా కనిపిస్తుంది.దానికి కారణం ఆ కుక్కకు గొర్రె తోలు వంటి డ్రెస్ వేశారు.దీంతో ఆ కుక్క ఎవరు గుర్తుపట్టలేనంతంగా మారిపోయింది.గొర్రెల మందలో ఉన్నా దానిని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు.అయితే ఇంతకుముందు ఒక జంతువు మరో జంతువు చర్మాన్ని ధరించి గొర్రెల గుంపులో చేరడం మనం వినే ఉంటాం.

కానీ ఈ వీడియోలు అలాంటి ఘటనను నిజంగా చూడవచ్చు.ఈ వీడియోలు కుక్కకు గొర్రె రూపంతో కనిపించే దుస్తులు వేశారు.

దీంతో ఈ కుక్కను దూరం నుంచి చూస్తుంటే.పొడవాటి జుట్టుతో గొర్రెల మందతో కూర్చుని ఉంది.

అయితే కాసేపటికి కుక్కకు గొర్రెలు కనిపెట్టాయి.దీంతో కుక్క నుంచి పక్కకు జరిగి వేరేగా నిలబడ్డాయి.దీంతో కుక్క కూడా గొర్రెల మందను అలాగే చూస్తూ నిలబడి ఉంది.సోషల్ మీడియాలో ఒక నెటిజన్ ఈ వీడియోను షేర్ చేశాడు.దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.ఇప్పటివరకు 1.70 లక్షల మంది ఈ వీడియోను చూశారు.అలాగే ఈ వీడియోకు పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి.

అండర్ కవర్ డాగ్ అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube