ప్రేమ పేరుతో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం.. అపై ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులు..!

ఓ యువకుడు ప్రేమ పేరుతో బీటెక్ చదివే విద్యార్థిని వెంటపడ్డాడు.ప్రేమ కోసం చావడానికి కూడా సిద్ధపడ్డాడు.

ఆమెను నమ్మించడం కోసం తన చేతిని కూడా కోసుకున్నాడు.దీంతో అతడి ప్రేమను నిజం అని నమ్మిన తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని బెదిరించి మరో యువకుడు కూడా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తాడిపత్రిలో( Tadipatri in Andhra Pradesh ) వెలుగులోకి వచ్చింది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.తాడిపత్రికి చెందిన ఓ యువతి విజయవాడలో బీటెక్ చదువుతోంది.

Advertisement
A BTech Student Was Raped In The Name Of Love And Threats Were Made By Taking Ph

తాడిపత్రికే చెందిన కృష్ణారెడ్డి( Krishna Reddy ) అనే యువకుడు విజయవాడలో ఐదు నెలల క్రితం ఈ బీటెక్ చదువుతున్న విద్యార్థినికి పరిచయం అయ్యాడు.ప్రేమిస్తున్నానని వెంటపడి, ఆమెను నమ్మించడం కోసం బ్లేడుతో చేతిని కూడా కోసుకున్నాడు.

దీంతో అతని ప్రేమను గుడ్డిగా నమ్మేసింది.ఇద్దరూ ప్రేమించుకోవడం మొదలుపెట్టారు.

A Btech Student Was Raped In The Name Of Love And Threats Were Made By Taking Ph

అక్టోబర్ 19వ తేదీ విజయవాడ హాస్టల్ లో ఉండే యువతికి ఫోన్ చేసి బెంగళూరు రావాలని కోరాడు.ఒకవేళ రాకపోతే ప్రేమ విషయాన్ని ఇంట్లో వారికి చెబుతానని బెదిరించాడు.దీంతో ఆ యువతి అక్టోబర్ 20వ తేదీ బెంగళూరు వెళ్ళింది.

ఆ యువతీని కృష్ణారెడ్డి తన ఫ్రెండ్ రూమ్ కి తీసుకెళ్లి నాలుగు రోజులపాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఆ తర్వాత యువతి సొంతూరుకి వెళ్లి, అక్టోబర్ 28వ తేదీ కాలేజీకి వెళ్లడం కోసం బయలుదేరింది.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
స్టార్స్ ను మించిన ప్రయోగాత్మక పాత్రలో నాని.. ది ప్యారడైజ్ గ్లింప్స్ వేరే లెవెల్!

ఆమె తండ్రి గుత్త వద్ద దింపి వెళ్లిన, కాసేపటి తర్వాత గుంతకల్ పట్టణానికి చెందిన దివాకర్( Diwakar ) అనే వ్యక్తి ఆ యువతికి ఫోన్ చేసి, బెంగుళూరులో కృష్ణారెడ్డి తో ఏకాంతంగా కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, గుంతకల్లుకు రాకపోతే వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.

Advertisement

ఆ మాటలు విన్న యువతి భయంతో ఏం చేయాలో తెలియక గుంతకల్ వెళ్ళింది.ఆ యువతిని స్థానికంగా ఉండే ఓ లాడ్జికి తీసుకెళ్లిన దివాకర్ ఆమెపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.ప్రేమ పేరుతో గుడ్డిగా నమ్మించి మోసం చేసిన కృష్ణారెడ్డి సన్నిహితంగా ఉండే సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలను తాడిపత్రికి చెందిన కొంతమందికి పంపించాడు.

చివరికి ఆ ఫోటోలు, వీడియోలు యువతి సమీప బంధువులకు చేరాయి.ఆ బంధువులు యువతీ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే యువతితో కలిసి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు