ఒట్టేసి చెబుతున్నా సినిమాలో బ్రహ్మానందం, కోవై సరళ దంపతులకు ఒక నల్ల పిల్లోడు జన్మిస్తాడు.అప్పుడు బ్రహ్మానందం కోవై సరళని అనుమానిస్తూ అవమానిస్తాడు.
ఇలాంటి ఘటనలు నిజజీవితంలో కూడా జరిగాయి.ఒక వ్యక్తి తన తెల్ల భార్యకి డార్క్ కలర్ బేబీ జన్మనిచ్చిందని ఆమెను వదిలేశాడు.
అయితే ఇటీవల కూడా ఒక వైట్ కపుల్‌కి డార్క్ కలర్ బిడ్డ జన్మించింది.వీరి స్టోరీకి సంబంధించి ఒక వీడియో క్లిప్ ట్విట్టర్‌లో వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.కొందరు కొంటెగా కామెంట్స్ కూడా చేస్తున్నారు.ఈ వీడియోను @30SECVIDEOS అనే ఒక ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 79 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
వైరల్ వీడియో ఓపెన్ చేస్తే.ఒక యువతి, యువకుడు తమ బ్రేకప్‌కి ముందు దిగిన ఫొటోలు కనిపించాయి.బ్రేకప్ తర్వాత ఆ యువతి ఏడుస్తూ కనిపించింది.ఒక వారం తర్వాత కూడా డిప్రెషన్‌లోనే ఉంది.
నెల రోజులు అయ్యాక ఈ రిలేషన్‌షిప్ గురించి మరిచి తనను తాను ఇంప్రూవ్ చేసుకునే పనిలో పడింది.అప్పుడే తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది.
ఈ విషయం తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌కి చెప్పగా అతడు వెంటనే ఆమెతో మళ్లీ తన ప్రేమను ప్రారంభించాడు.తొమ్మిది నెలల తర్వాత వీళ్లకొక ఆడబిడ్డ జన్మించింది.
అయితే ఈ జంటలో ఇద్దరూ కూడా తెల్లగానే ఉన్నారు.కానీ బేబీ మాత్రం డార్క్ కలర్‌లో పుట్టింది.
ఈ వీడియోలో ఆ బేబీ ఫొటోలు కూడా చూపించారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు అసలు ఇదెలా జరుగుతుందని నోరెళ్లబెడుతున్నారు.సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి వాళ్ళిద్దరూ కలిసి ఈ బ్లాక్ బేబీని కాసేపు రెంట్‌కి తీసుకున్నారా ఏంటీ అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.అయ్యో, ఏంటిది కచ్చితంగా అతడు ఈ పిల్లకు తండ్రి కాడు అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.
ఫ్యామిలీలో మిక్సిడ్ రేస్ ఉంటే వారి డిఎన్ఏ వల్ల ఇలా పుట్టే ఛాన్స్ ఉందని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.ఆమె డిఎన్ఏలో మిశ్రమ జాతి ఉంటే ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఒకరు వ్యాఖ్యానించారు.