కొత్త బైక్ అంటే ఎవరికైనా చెప్పలేని ఆనందం ఉంటుంది.ఇక తమ కల నెరవేరినప్పుడు చాలా మంది సంతోషంలో మునిగిపోతారు.
ఒక్కసారిగా సంతోషం చుట్టుముట్టినప్పుడు ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో వారికి తెలియదు.అన్నీ తికమకగా చేసేస్తుంటారు.
తాజాగా ఓ వ్యక్తి కూడా ఇలాగే చేశాడు.ఇంటర్నెట్లో మిమ్మల్ని నవ్వించే కంటెంట్‌కు కొరత లేదు.
నిత్యం ఎన్నో ఫన్నీ వీడియోలు మనకు దర్శనమిస్తుంటాయి.తాజాగా అలాంటి నవ్వులు పూయించే ఓ సంఘటన జరిగింది.
దానికి సంబంధించి ఆన్లైన్లో వైరల్‌గా మారిన క్లిప్‌లో, ఒక వ్యక్తి తన కొత్త మోటార్‌సైకిల్‌కు పూలమాల వేయడానికి బదులుగా తన భార్య మెడలో దండ వేశాడు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ఈ అందమైన వీడియోను చికూ అనే పేజీ ట్విట్టర్లో షేర్ చేసింది.ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, కొత్త మోటర్‌బైక్ కొనుగోలు చేసిన తర్వాత ఒక కుటుంబం షోరూమ్‌లో గుమిగూడిన దృశ్యాన్ని చూడవచ్చు.వాహనానికి అప్పటికే రిబ్బన్ తగిలించబడి ఉంది.
సేల్స్ మాన్ దాని కోసం ఒక దండను కూడా సిద్ధం చేస్తున్నాడు.తన తండ్రి దండ కోసం ఎదురు చూస్తున్న సమయంలో కొడుకు తన తల్లిని సరికొత్త మోటార్‌సైకిల్‌తో ఫోజులివ్వమని అడిగాడు.
సేల్స్ మాన్ దానిని ఆ వ్యక్తికి అందించిన వెంటనే, అతను దానిని తన భార్య మెడలో వేయడానికి ముందుకొచ్చాడు.
తన భర్త చేసే పని చూసి ఆ భార్య నవ్వుతుంది.ఆ దండను తన మెడలో కాదని, బండికి వేయాలని సూచిస్తుంది.ఈ ఘటన ఆ ప్రాంతంలో నవ్వులు పూయించింది.
ఆన్లైన్లో షేర్ చేసిన తర్వాత వీడియో 3 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది.నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
కొత్త బైక్ కొన్న ఆనందం అతడిని పూర్తిగా మార్చేసిందని కొందరు అంటుంటే, భార్యపై ప్రేమను అతడు అలా వ్యక్తపరిచాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.