తిరుమలలో ఎస్సీ మ్యూజియం వద్ద స్వామి వారి దర్శనానికి పంపలేదని నిరసనకు దిగిన భక్తులు తిరుమలలో స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ వద్దకు వచ్చిన భక్తులకు చేదు అనుభవం ఎదురయింది.స్వామివారి దర్శనం కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులను కాలినడకన తిరుమలకు వచ్చిన భక్తులను టీటీడీ అధికారులు విజిలెన్స్ వారు క్యూలైన్లోకి అనుమతించుకోవడంతో ఎస్వి మ్యూజియం వద్ద నిరసనకు దిగారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో షెడ్డులు అన్ని వినడంతో భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించలేదని విజిలెన్స్ అధికారులు తెలిపారు.దీంతో ఆగ్రహానికి గురైన భక్తులు తిరుమలలోని మ్యూజియం వద్ద రోడ్డుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు.
టిటిడి విజన్స్ అధికారులతో వాగ్వాదానికి దిగిన శ్రీవారి భక్తులు, మాకు స్వామి వారి దర్శనం కల్పించేంతవరకు మా నిరసన ఆపమని భక్తులు చెప్పడంతో భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తామన్న టిటిడి అధికారులు.
ఉదయం 12 గంటలకు దర్శనం కోసం వెళితే సాయంత్రం పంపుతాను అన్న టిటిడి అధికారులు ఇప్పుడు క్యూ లైన్ లో పంపించకపోవడంతో నిరసన చేయాల్సి వచ్చిందని భక్తులు ఉన్నారు.
టీటీడీ ప్రభుత్వం వీఐపీలకే పెద్ద పీట వేస్తుందని సామాన్య భక్తుని పట్టించుకోవడంలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.టీటీడీ విజిలెన్స్ విజిఓ మాట్లాడుతూ రేపు కోయిల్వార్ తిరుమంజనం కారణంగా, ఈరోజు వర్షం పడుతున్న కారణంగా భక్తులు కొద్దిగ సౌకర్యం గురియ్యారని భక్తుల సమస్యను తీర్చి వారికి స్వామి వారి దర్శనం భాగ్యం కలిగే విధంగా చర్యలు తీసుకున్నామని వీజీవో తెలిపారు
.