టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరుకావడంపై సస్పెన్స్ నెలకొంది.ఇవాళ విచారణకు రావాలని రెండు రోజుల క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అందించిన విషయం తెలిసిందే.
కాగా ఈడీ విచారణను నిలిపివేయాలని ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రిట్ పిటిషన్ తో విచారణకు రోహిత్ రెడ్డి హాజరుకావడం లేదని తెలుస్తోంది.
అయితే రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది.ఈ నేపథ్యంలో ఇవాళ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు అవుతారా.? లేదా.? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.