కృష్ణా ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెనుప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా: కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల అప్రమత్తతతో ఆదివారం పెను ప్రమాదం తప్పింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలోకి కృష్ణా ఎక్స్ ప్రెస్ వస్తున్న సమయంలో రైలులో విచిత్రమైన శబ్దం రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అధికారులకు విషయాన్ని తెలియజేయడంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆలేరు రైల్వేస్టేషన్ సమీపంలో రైలును ఉన్నాఫలంగా నిలిపివేశారు.హుటాహుటిన రైల్వే సిబ్బంది రైల్వే ట్రాక్ పైకి చేరుకొని రైలు పట్టా విరిగిపోవడం గుర్తించి మరమ్మతులు చేపట్టారు.

దీనితో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు,అధికారులు ఊపిరి పిల్చికున్నారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పూల రవీందర్ కే మా బహుజన టీచర్స్ జేఏసీ మద్దతు
Advertisement

Latest Video Uploads News