రకుల్‌ను వదలని దర్శకుడు

ఒకటి రెండు ఫ్లాప్‌లు వచ్చినా కూడా ప్రస్తుతం టాలీవుడ్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లక్కీ స్టార్‌ హీరోయిన్‌గా దూసుకు పోతుంది.తాజాగా ఈమె ‘సరైనోడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Rakul Preet Again In Boyapati’s Next-TeluguStop.com

అంతుకు ముందు వచ్చిన ‘బ్రూస్‌లీ’ సినిమా ఈమెకు తీవ్ర నిరాశను మిగిల్చింది.అయితే బన్నీ ఈమెకు సక్సెస్‌ను తెచ్చి పెట్టడం ఖాయం అని మొదటి నుండి టాక్‌ వచ్చింది.

అనుకున్నట్లుగానే సరైనోడు చిత్రంకు పాజిటివ్‌ టాక్‌ వస్తోంది.ఆ సినిమాలో ఈమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది.

ఈ నేపథ్యంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు మరో బంపర్‌ ఆఫర్‌ దక్కింది.

బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ సినిమాలో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంపిక అయ్యింది.

సరైనోడు సినిమా సమయంలోనే దర్శకుడు బెల్లంకొండ ఈమెను ఎంపిక చేసుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.బెల్లంకొండ చిన్న హీరో అయినా కూడా దర్శకుడు బోయపాటిపై ఉన్న నమ్మకంతో ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిటన్లుగా తెలుస్తోంది.

రకుల్‌ను వదలకుండా వరుసగా రెండవ సినిమాకు సైతం దర్శకుడు బోయపాటి శ్రీను ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేసుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube