బన్నీ జీవిత ఆశయం!!

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘సరైనోడు’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళంలో కూడా భారీగా విడుదల చేశారు.

 Allu Arjun Reveals His Goal-TeluguStop.com

ఇక ఈ సినిమాను ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక మరియు ఓవర్సీస్‌లో సైతం భారీగా విడుదల చేయడం జరిగింది.ఈ సినిమా విడుదల సందర్బంగా నిన్న బెంగళూరులో అల్లు అర్జున్‌ అక్కడ మీడియా వారితో ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేయడం జరిగింది.

కన్నడ ప్రేక్షకుల వద్దకు ఈ సినిమాను తీసుకు వెళ్లేందుకు బన్నీ ప్రయత్నాలు చేశాడు.

తెలుగుతో పాటు మలయాళంలో మంచి క్రేజ్‌ ఉన్న అల్లు అర్జున్‌ భవిష్యత్తులో తమిళం మరియు కన్నడంలో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ఉబలాట పడుతున్నాడు.

అదే తన జీవిత ఆశయం అంటున్నాడు.తాజాగా బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.

తాను నటించిన ప్రతి సినిమా కూడా తెలుగుతో పాటు సౌత్‌ భాషలన్నింటిలో కూడా విడుదల కావాలని కోరుకుంటున్నాను అని, అందుకోసం తాను ఎంత కష్టపడేందుకు అయినా సిద్దం అని బన్నీ చెప్పుకొచ్చాడు.అదే తన జీవిత ఆశయం అని కూడా బన్నీ పేర్కొన్నాడు.

ఇప్పటికే తెలుగు మరియు మలయాళంలో ఈయన క్రేజ్‌ను దక్కించుకున్నాడు.ఇక తమిళం మరియు కన్నడంలో గుర్తింపు తెచ్చుకుంటే బన్నీ జీవిత ఆశయం నెరవేరినట్లే.

కాని అనుకున్నంత సులువు కాదు బన్నీ జీవిత ఆశయం నెరవేరడం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube