ప్రస్తుతం ఏ తెలుగు సినీ ప్రేక్షకుడిని కదిలించినా కూడా సర్దార్ గబ్బర్‌సింగ్ గురించిన విశేషాలే వినిపిస్తున్నాయి.గత కొన్ని నెలలుగా మెగా ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది.దాంతో ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఈ సినిమా కోసం చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంకు వారం ముందే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిన విషయం తెల్సిందే.సెన్సార్ తర్వాత ఈ సినిమా లెంగ్త్ కాస్త ఎక్కువ అయ్యిందనే టాక్ వచ్చిందట.
దాంతో ప్రస్తుతం పవన్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఆ పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం తెలుగు సినిమాల ట్రెండ్‌ను అనుసరించి రెండున్నర గంటల లోపులోనే సినిమాను ఉంచాలని భావిస్తున్నారు.
సెన్సార్‌కు రెండున్నర గంటలకు పైగా చిత్రాన్ని పంపారు.అయితే లెంగ్త్ ఎక్కువ అయితే మళ్లీ సమస్యలు వస్తాయనే ఉద్దేశ్యంతో దాదాపు 10 నుండి 15 నిమిషాల నిడివి ఫిల్మ్‌ను తొలగించనున్నట్లుగా తెలుస్తోంది.
సినిమా సక్సెస్ అయ్యి, కలెక్షన్స్ కురిపిస్తే తొలగించిన సీన్స్‌లలో 10 నిమిషాలు యాడ్ చేయడం వల్ల మళ్లీ కలెక్షన్స్ రాబట్టుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.రేపు విడుదల కానున్న నేపథ్యంలో నేడు సాయంత్రం వరకు ఫైనల్ కట్స్ పూర్తి అయ్యే అవకాశం ఉంది.
మద్యరాత్రి నుండే థియేటర్లలో సర్దార్ సందడి షురూ కాబోతుంది.







