మహేష్ తో శతృత్వంపై నోరు విప్పనున్న పవన్

ఇద్దరు సమానమైన పోటిదారులు ఉంటేనే ఆటలో మజా వస్తుంది.అది పోలిటిక్స్ అయినా , క్రీడ అయినా, సినిమా ఇండస్ట్రీ అయినా.

 Pawan Kalyan To Talk About Rivalry With Mahesh-TeluguStop.com

మరి మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రధాన పోటిదారులు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే రెండు పేర్లు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.కొత్త రికార్డులు పుట్టాలన్నా, పాత రికార్డులు చెదిరిపోవాలన్నా ఈ ఇద్దరు రావాల్సిందే.

బాక్సాఫీస్ వద్ద అంత పోటి నెలకొని ఉంటుంది కాబట్టే .వీరి అభిమానులు ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు.అందుకే మీడియా కూడా తరుచుగా వీరిని బాక్సాఫీస్ శతృవులలా చూపిస్తూ ఉంటుంది.

ఈ పోటి గురించి అడిగే ధైర్యం తెలుగు మీడియాకి రాలేదు కాని, ప్రముఖ బాలివుడ్ క్రిటిక్, సినీ జర్నలిస్టు రాజీవ్ మసంద్ డైరెక్టుగా పవన్ కళ్యాణ్ నే మహేష్ తో శతృత్వం గురించి అడిగేశాడు.

మరి పవన్ ఏం సమాధానం చెప్పాడు? ఏమో ! ఈరోజు సాయంత్రం 6:30 అయితే తప్ప చెప్పలేం.ఎందుకంటే అప్పుడే ఆ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అవబోతోంది.

సినిమాల గురించి,పొలిటిక్స్ గురించి చాలానే చెప్పాడట పవన్ ఈ ఇంటర్వ్యూ లో.కాని మొదటసారి మహేష్ బాబు మీద పెదవి విప్పనున్నాడు పవన్.ఏం చెప్పాడో అని ఉత్కంఠగా ఉన్నా, ఓపికగా ఉండాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube