సర్దార్‌ హౌస్‌ఫుల్‌

పవన్‌ కళ్యాణ్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’.ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు ముగించుకుంది.

 Sardaar Premier Show Housefull-TeluguStop.com

మరో వారం రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది.నిన్న మొన్నటి వరకు పాటల చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది.

ఒక వైపు విడుదలకు సిద్దం అవుతున్న నేపథ్యంలో మరో వైపు ఈ చిత్రం ప్రీమియర్‌ షో టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.

ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో పంపిణీ చేస్తున్న వారు ప్రీమియర్‌ షో టికెట్లను ఇప్పటికే ఆన్‌ లైన్‌లో ఉంచారు.

ఆన్‌లైన్‌లో ఉంచిన 24 గంటల్లోనే పలు స్క్రీన్స్‌లకు సంబంధించిన టికెట్లు అమ్ముడు పోయినట్లుగా తెలుస్తోంది.సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్‌ షోలకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు అయ్యే అవకాశాలున్నాయి.

భారీ స్థాయిలో అంచనాలున్న ఈసినిమా ప్రీమియర్‌ షోల రూపంలోనే నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్లకు కోట్లలో లాభాలను తెచ్చి పెట్టనున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పవన్‌తో కలిసి ఆయన సన్నిహితుడు శరత్‌ మారార్‌ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube