లేటు వయస్సులో రికార్డుల మీద రికార్డులు

ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్‌ హీరోల హవా సాగుతోంది.

పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌బాబు, ప్రభాస్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ లాంటి యంగ్‌ హీరోలు టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నారు.

వీరికి మాత్రమే ఇప్పటి వరకు 40 కోట్లను మించిన కలెక్షన్స్‌ దక్కాయి.సీనియర్‌ హీరోలు మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేక పోతున్నారు.

తాజాగా నాగార్జున ఆలోటును తీర్చాడు.‘మనం’ చిత్రంతో మంచి కలెక్షన్స్‌ దక్కించుకుని, సోగ్గాడి చిత్రంతో రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి, ఇప్పుడు ‘ఊపిరి’ చిత్రంతో మరో రికార్డును సొంతం చేసుకోబోతున్నాడు.

ఇప్పటి వరకు నాగార్జున నటించిన ఏ సినిమా కూడా వెయ్యి థియేటర్లకు పైగా విడుదల అయ్యింది లేదు.మొదటి సారి ‘ఊపిరి’ చిత్రం ఏకంగా రెండు వేల థియేటర్లలో విడుదలకు సిద్దం అవుతోంది.

Advertisement

ప్రస్తుతం టాలీవుడ్‌ వద్ద సందడి లేక పోవడంతో పాటు, ఇతర హీరోల సినిమాల పోటీ లేకపోవడంతో నాగార్జున ‘ఊపిరి’ చిత్రాన్ని భారీ సంఖ్య థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు.ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు.

రికార్డు స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుండటంతో నాగార్జున కెరీర్‌లో కొత్త రికార్డు నమోదు అయ్యింది.ఇలా లేటు వయస్సులో నాగార్జున రికార్డుల మీద రికార్డులు సాదిస్తూ తనతోటి హీరోలకు జలసీ కలిగిస్తున్నాడు.

ఊపిరి చిత్రం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

భూములపై చంద్రబాబు దుష్ప్రచారం.. సీఎం జగన్ ఫైర్
Advertisement

తాజా వార్తలు