గత మూడురోజులుగా ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే పవన్ అభిమానులకి వణుకు పుడుతోంది.దానికి ప్రధాన కారణం బాలివుడ్ క్రిటిక్ కేఆర్కే అయితే, ఇప్పుడు ఆ మహానుభావుడికి జత కలిసాడు పవన్ అభిమానుల చిరకాల శతృవు రామ్ గోపాల్ వర్మ.
పవన్ కళ్యాణ్ కార్టూన్, జోకర్,సైడ్ క్యారెక్టర్లకి కూడా పనికిరాడు, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న చెడ్డవాడు, పవన్ ని హిందీలో కుక్కలు కూడా చూడవు, తెలుగులో స్టార్ అయితే ఏంటి .హిందిలో రాజ్పాల్ యాదవ్ లాంటి కామెడియన్ కూడా తనకన్నా నయం అని కేఆర్కే గట్టిగా పరువుతీస్తోంటే … ఎప్పటిలాగే కత్తికి తేనేరాసి మెల్లిగా దింపుతున్నాడు రామ్ గోపాల్ వర్మ
సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో రిలీజ్ చేస్తే, పవన్ కళ్యాణ్ కన్నా ప్రభాస్ పెద్ద స్టార్ అని దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటారని, హిందీలో విడుదల చేయాలనుకోవడం చాలా చెత్త నిర్ణయమని తన స్టయిల్ లో ఆడుకున్నాడు రామ్ గోపాల్ వర్మ
ఈ ఇద్దరు వ్యక్తులు వేరైనా, ఇద్దరు కలిసే పవన్ కళ్యాణ్ ని కావాలనే అవమానిస్తున్నారు.గత ఆరు నెలల నుంచి రామ్ గోపాల్ వర్మకి క్లోజ్ ఫ్రెండ్ గా మారిపోయాడు కేఆర్కే.అందరిని తిడుతూ వర్మకి మాత్రం భజన వేస్తున్నడు అతను.
పవన్ కళ్యాణ్ గురించి ఇలా రాయమని రామ్ గోపాల్ వర్మే కేఆర్కేని ప్రేరేపించి ఉంటారని సగటు సినీఅభిమాని అనుమానం
.






