బుల్లి తెరపై తన హాట్ అందాలతో యాంకర్‌గా ఆకట్టుకున్న అనసూయ తాజాగా ‘క్షణం’ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించిన విషయం తెల్సిందే.ఆ సినిమా ఈమెకు నటిగా మంచి గుర్తింపు తీసుకు వచ్చింది.
ఆ సినిమాతో ఈమెకు పేరు రావడంతో పాటు, కొన్ని పుకార్లు కూడా పుట్టుకు వచ్చాయి.ఇండస్ట్రీ వర్గాల ద్వారా ఈమె ఆ చిత్రంలో నటించిన ఒక యువ హీరోతో అఫైర్ నడుపుతున్నట్లుగా ప్రచారం జరిగింది.
దాంతో మీడియాలో సైతం పెద్ద ఎత్తున ఈమెపై పుకార్లు పుట్టుకు వచ్చాయి.
పెళ్లి అయ్యి, ఇద్దరు పిల్లలు ఉన్న అనసూయ ఆ వార్తలను తీవ్రంగా తిప్పి కొట్టింది.
మీడియాలో వచ్చిన ఈ వార్తలను చెత్త వార్తలుగా అనసూయ అభివర్ణించింది.అలాగే సదరు హీరోతో దూరం కూడా పెంచుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రమోషన్ సమయంలో ఆ హీరో అనసూయతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా మీడియా వారికి లీక్ చేశాడు అని, అలాగే సినీ వర్గాల్లో కూడా ప్రచారం చేశాడు అనే టాక్ వినిపిస్తోంది.దాంతో అతనికి దూరంగా ఉండి, సీరియస్ వార్నింగ్ కూడా అనసూయ ఇచ్చిందనే టాక్ సినీ వర్గాల్లో జరుగుతోంది.







