మెగా బ్రదర్‌ ఆ పని చేయడు

మెగా బ్రదర్స్‌ చిరంజీవి, నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌ కొన్ని సంవత్సరాల వరకు అంతా ఒకే మాట, ఒక బాటలో ఉండే వారు.కాని రాజకీయాల కారణంగా దారులు మారాయి.

 Rumors On Nagababu Joining Ysrcp-TeluguStop.com

చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లు పూర్తిగా రాజకీయ విరోధులు అయ్యారు.బయటకు చూసేందుకు కాస్త మాట్లాడుకుంటున్నట్లుగా అనిపించినా కూడా రాజకీయంగా మాత్రం ప్రత్యర్థులుగానే కొనసాగుతున్నారు.

ఇక నాగబాబు మాత్రం అన్న చిరంజీవి పక్కనే ఉంటున్నాడు, ఉంటాడు అనే టాక్‌ ఉంది.కాని నాగబాబు కూడా పార్టీ మారి చిరంజీవికి యాంటీ పార్టీ అయిన వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నాగబాబు వైకాపాలో చేరడంపై మెగా సన్నిహితులు సీరియస్‌గా స్పందించారు.నాగబాబు వైకాపాలో చేరబోతున్నాడు అనేది గాలి వార్తలు మాత్రమే అని, అలాంటి ఉద్దేశ్యంను ఎప్పటికి కూడా నాగబాబు పెట్టుకోడు, అలాంటి ఆలోచనే చేస్తాడని అనుకోవడం లేదు అని ఆయన సన్నిహితులు మరియు మెగా ఫ్యాన్స్‌ అంటున్నారు.

నాగబాబు రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటున్నాడు.ఈ తరుణంలో వైకాపాతో దోస్తీ గురించి ఎలా పుకార్లు పుట్టుకు వచ్చాయి, అసలు ఇలాంటి వార్తలు ఎలా మొదలయ్యాయి అనేది చర్చ నీయాంశంగా ఉంది.

గతంలో కూడా నాగబాబు గురించిన ఇలాంటి వార్త ఒకటి ఫిల్మ్‌ సర్కిల్స్‌తో పాటు మీడియాలో తెగ ప్రచారం అయ్యింది.దాంతో స్వయంగా నాగబాబు తాను అన్నకు తోడుగా ఉంటాను అంటూ ప్రకటించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube