వెండి తెరపై దర్శకేంద్రుడు?

వెండి తెరపై ఎన్నో అద్బుతాలను సృష్టించిన దర్శకుడు రాఘవేంద్ర రావు.ఈయన దర్శకుడిగా వందకు పైగా చిత్రాలు చేసి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను సంపాదించుకున్నాడు.

 K Raghavendra Rao Acting Debut With Shatamanam Bhavathi-TeluguStop.com

ఇంత చేసిన రాఘవేంద్ర రావు ఇప్పటి వరకు వెండి తెరపై కనిపించింది లేదు.ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమాలో అయినా చిన్న పాత్రలో ఈ దర్శకేంద్రుడు నటించలేదు.

కాని తాజాగా టాలీవుడ్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం త్వరలోనే రాఘవేంద్ర రావు ఒక ముఖ్య పాత్రలో వెండి తెరపై కనిపించబోతున్నాడు.

రాజ్‌ తరుణ్‌ హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో సతీష్‌ అనే దర్శకుడు ‘శతమానం భవతి’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

దర్శకుడు సతీష్‌కు రాఘవేంద్ర రావుతో సన్నిహిత సంబంధాలున్నాయి.ఆ సంబంధంతో ఈ సినిమాలోని ఒక ముఖ్య పాత్రలో రాఘవేంద్ర రావును నటింపజేయాలని ప్రయత్నం చేశాడు.

అందుకు రాఘవేంద్ర రావు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.రాజ్‌ తరుణ్‌తో కలిసి దర్శకేంద్రుడు స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నాడు.

సినిమాలో కూడా నిజ జీవిత పాత్రలో రాఘవేంద్ర రావు కనిపిస్తాడని, దర్శకుడిగా ఈయన నటిస్తాడు అనే టాక్‌ వినిపిస్తోంది.ఇప్పటి వరకు తెర వెనుక ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్న రాఘవేంద్ర రావు తెరపై కనిపించి ప్రేక్షకులను మెప్పిస్తాడేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube