ఏమిటి ఈ విచిత్రం మహేష్ బాబు!

ఆగడు సినిమా పేరు చెబితే బకీట్లకొద్ది కన్నీళ్ళు కార్చేస్తారు మహేష్ బాబు అభిమానులు.ఆ సినిమా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు అలాంటివి.

 Mahesh Babu’s Pokkiri Police Is A Hit-TeluguStop.com

పోకిరి తరువాత అంతటి మాస్ సినిమా అని ఊరించి ఊరించి ఉరి తీసినంత పనిచేసాడు దర్శకుడు శ్రీనువైట్ల.మహేష్ కెరీర్లోనే కాదు, ఆ సినిమా కొన్న పంపిణిదారలందరికి ఆ సినిమా ఓ పీడకల.

కాని అదేం విచిత్రమో, తెలుగు ప్రజలు ఛీకొట్టిన సినిమాని పక్కరాష్ట్రలవాళ్ళు ఆదరిస్తున్నారు.

మొదట తమిళంలో 30 లక్షలకు కొని “ఇదు తండా పోలీస్’ అని రిలీజ్ చేస్తే ఏకంగా కోటిన్నర గ్రాస్ సాధించి భారి సక్సెస్ నమోదు చేసుకుంది ఆగడు.

అసలు అలా ఎలా చూస్తున్నారు జనాలు అని మహేష్ అభిమానులు కూడా బుర్ర గోక్కున్నారు.ఇప్పుడు మళ్ళీ ఓ విచిత్రం జరిగింది.

గత నెల 29 న మళయాలంలో పోక్కిరి పోలీస్ పేరుతో విడుదల చేసారు ఆగడుని.కొన్నది 18 లక్షలకైతే మొదటిమూడు రోజుల్లోనే 22లక్షల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.

అది కూడా పదుల సంఖ్య థియేటర్లలో విడుదలై.

ఏమిటో ఈ విచిత్రం.

ఇక్కడ భారిఎత్తున రిలీజ్ అయ్యి భారి నష్టాలు తెచ్చిపెట్టిన చిత్రం తమిళ, మలయాళ భాషల్లో చాలా తక్కువ థియేటర్లలో విడుదలై భారి లాభాలు తెచ్చిపెడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube