ఇంట్లోవాళ్ళతో అల్లు అర్జున్ కి కష్టాలు

బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం సరైనోడు.బోయపాటికి మాస్ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉంది.

 Allu Arjun’s Trouble With Home Banner-TeluguStop.com

అది బన్నకి బాగా ప్లస్ అవుతుంది.బోయపాటి సక్సెస్ రేట్ కూడా బాగా ఉంది.

ఆయన చివరిచిత్రం లెజెండ్ భారి విజయాన్ని సొంతం చేసుకుంది.కాని బన్నిని ఒక భయం వెంటాడుతోంది.

అదే గీతా ఆర్ట్స్.

అల్లువారి సొంత బ్యానర్లో అల్లు అర్జున్ సినిమాలు మూడు వచ్చాయి.

అవే గంగోత్రి, హ్యాపి,బద్రినాథ్.వీటిలో ఏ ఒక్క చిత్రం కూడా హిట్ కాలేదు.

అల్లు అబ్బాయి మొదటిచిత్రం గంగోత్రి యావరేజ్ గా ఆడితే హ్యాపి, బద్రినాథ్ ఫ్లాప్ ట్యాగ్ సంపాదించుకున్నాయి.ఇప్పుడు సరైనోడు కూడా గీతా ఆర్ట్స్ నిర్మాణంలోనే తెరకెక్కుతోంది.

ఇంట్లోవాళ్ళతో సినిమా అంటే భయపడుతున్నారు మెగాఫ్యాన్స్.

మరి ఈ సెంటిమెంట్ ఈసారైనా బ్రేక్ అవుతుందో లేక సొంత బ్యానర్ లో మళ్ళీ హిట్ కొట్టలేక విఫలమవుతాడో బన్ని.

షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్, కెథరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఎప్రిల్ లో సరైనోడు తన సత్తా చూపించేందుకు సన్నద్ధమవుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube