ఎప్పటినుంచైతే సుధీర్ బాబు తన తరువాతి సినిమా మహేష్ బాబు నిర్మాణంలో ఉంటుందని ప్రకటించాడో, ఆ ప్రాజెక్టుకి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తారని రూమర్లు పుట్టుకొచ్చాయి.సుధీర్ ని స్టార్ చేద్దామని మహేష్ ఫిక్స్ అయిపోయాడని, అందుకోసమే సుధీర్ – శ్రీనువైట్ల కాంబినేషన్ సెట్ చేసాడని తెలుగు మీడియా తెగ రాసేసింది.కాని ఈ వార్తల్ని కొట్టిపారేశాడు సుధీర్ బాబు.
” మహేష్ శ్రీనువైట్లగారి దర్శకత్వంలో నాతో సినిమా నిర్మించబోతున్నాడు అనే వార్తలో నిజం లేదు.భలే మంచి రోజు తరువాత నేను ఏ తెలుగు సినిమా ఒప్పుకోలేదు.నాకు కూడా ఈ వార్త నిజమైతే సంతోషంగానే ఉండేది కాని దీని మీద శ్రీనువైట్ల గారితో ఎలాంటి చర్చలు జరగలేదు.
తదుపరి సినిమా ఏంటి అనేది నేను ఒప్పుకోగానే అనౌన్స్ చేస్తాను ” అంటూ చెప్పుకొచ్చాడు సుధీర్.
మహేష్ నిర్మాణంలో సుధీర్ సినిమా ఉంటుంది.అక్కడివరకే నిజం.విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఇంకా కథ కాని , దర్శకుడు కాని ఫిక్స్ అవలేదు.
మహేష్ , సుధీర్ , ఇద్దరు ప్రస్తుతం ఈ సినిమా కోసం కథలు వింటున్నారట.తొందరపడకుండా, కథాబలం ఉన్న చిత్రాన్నే నిర్మించాలని మహేష్ భావిస్తున్నట్లు సమాచారం.







