నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా రూపొందిన చిత్రం డిక్టేటర్.అంజలి, సోనాల్ చౌహాన్ హీరో హీరోయిన్స్ గా నటించారు.
సంక్రాంతి సందర్భంగా సినిమా జనవరి 14న విడుదలవుతుంది.సంక్రాంతి సందర్భంగా నాలుగు సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ, చిత్ర దర్శకుడు, కో ప్రొడ్యూసర్ శ్రీవాస్, ఈరోస్ ప్రతినిధులు చిత్ర డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ తో చర్చలు జరిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో వారికి విడుదల చేయడానికి, డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ పడుతున్న ఇబ్బందులను దృష్ట్యా వీరికి 15శాతం డిస్కౌంటును ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ 15శాతం డిస్కౌంట్ ఇవ్వడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అందరికీ సుమారు మూడు నుండి నాలుగు కోట్ల రూపాయల వరకు మేలు జరుగుతుంది.
ఈ మంచి నిర్ణయాన్ని డిక్టేటర్ డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అందరి స్వాగతిస్తూ నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.