మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తని ఒరువన్’ రీమేక్‌లో నటించబోతున్న విషయం తెల్సిందే.ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే చరణ్ మరో సినిమాను సైతం సెట్స్ పైకి తీసుకు వెళ్లబోవాలని ప్లాన్ చేస్తున్నాడు.
అందుకోసం చర్చలు, సంప్రదింపులు కూడా జరుపుతున్నాడు.తాజాగా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేస్తాడు అంటూ ప్రచారం జరిగింది.
అయితే తాజాగా ఆ సినిమా ఇంకా నిర్ణయించబడలేదు అంటూ గాంధీ క్లారిటీ ఇచ్చాడు.తాజాగా చరణ్ మూవీ గురించి మరో వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్‌తో గతంలో ‘పంజా’ వంటి ఫ్లాప్ చిత్రాన్ని తెరకెక్కించిన తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ ఇటీవల చరణ్‌కు ఒక కథ చెప్పాడు అని, ఆ కథ చరణ్‌కు బాగా నచ్చడంతో ఆ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ ప్రచారం జరుగుతోంది.విష్ణు వర్థన్‌కు స్టైలిష్ దర్శకుడు అనే పేరు ఉంది.
ఈయన తెరకెక్కించిన పలు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.కొన్ని మాత్రం ఫ్లాప్ అయ్యాయి.
దాంతో కథపై నమ్మకంతో పాటు, దర్శకుడు విష్ణువర్థన్‌పై నమ్మకంతో చరణ్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.అతి త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.
బాబాయి అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన విష్ణు వర్థన్ మరి అబ్బాయికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో చూడాలి.







