పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’.ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ గత కొంత కాలంగా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారీ అంచనాలున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కోసం పవన్ కలం పట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఇక ఈ చిత్రం స్క్రీన్‌ప్లేను పవన్ కళ్యాణ్ స్వయంగా రాయడం విశేషం.ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్నారు.
ఇక ఈ చిత్రం టీజర్‌ను సంక్రాంతికి విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
తాజాగా రతన్ పూర్ కా సర్దార్ ఆగయా అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.
ఆ పోస్టర్‌పై ఈనెల 14న సంక్రాంతి కానుకగా టీజర్ రాబోతుంది అంటూ వేశారు.ఇప్పటికే విడుదలైన టీజర్ ఫ్యాన్స్‌లో అంచనాలను తారా స్థాయికి తీసుకు వెళ్లింది.ఇక ఈ సారి వచ్చే టీజర్ అంచనాలను మరింతగా పెంచాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ సభ్యులు కొత్త టీజర్‌ను ఎంతో శ్రద్దతో కట్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ ట్రైలర్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
సంక్రాంతికి మెగా ఫ్యాన్స్‌కు సర్దార్‌తో అంతో ఇంతో ఊరట దక్కనుంది.







