బ్రూస్ లీ సినిమా అట్టర్ ప్లాప్ అయిన తరవాత తాను ఇచ్చిన ఒక్క సీన్ ని కూడా శ్రీనువైట్ల వాడలేదు అని అందుకే సినిమా ప్లాప్ అయ్యింది అని తప్పంతా ఆయన మీద తోసేసారు కోనా వెంకట్.అయితే సౌఖ్యం విడుదల తరవాత కూడా ఇవే కహానీలు చెప్పుకొచ్చారు కోనా.
తన పేరు ఈ సినిమాకి మాత్రమే ఇచ్చా అంటూ ఆయన చెప్పారు.ఇవన్నీ బాలకృష్ణ దృష్టికి వచ్చాయి ఏమో మరి బాలయ్య స్వయంగా కోనా ని పిలిపించి డిక్టేటర్ సినిమా విషయంలో సరైన కేర్ తీసుకోవాలి అనీ తరవాత రెండు సీన్లు వాడలేదు.
ఆరు సీన్లు వాడలేదు అంటే కాదు.అని చిన్నగా చెప్పారంటూ వదంతి ఒకటి టాలీవుడ్ లో వినిపిస్తోంది.
నిజంగా బాలయ్య అన్నారో.లేక కోన అంటే గిట్టని శ్రీనువైట్ల క్యాంప్ అలా పుట్టించిందో? ఇటీవల ఇదో సమస్య ఎక్కువగా వుంది టాలీవుడ్ లో.కోన వెంకట్ పై వార్త వస్తే, అది శ్రీనువైట్లు వర్గం కావాలని రాయించిందని…శ్రీను వైట్లపై వార్త వస్తే, కోన వెంకట్ రాయించారని.ఇలా అనుకుని సంతృప్తి పడుతున్నారు.







