కాపు సామాజిక వర్గం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పే పరిస్థితి కనిపిస్తోంది.అన్ని రాజికీయ పార్టీలూ వారికి పట్టం కడుతున్నాయి.‘కాపు సామాజిక వర్గం’ మీద స్పెషల్ ప్రేమ కురిపిస్తూ తమ రాజకీయ పావులు కదుపుతూ పోతున్నాయి ప్రతీ పార్టీ కూడా.
2014 ఎన్నికల సమయంలో కాపు సామాజిక వర్గానికి భారీ ప్రాధాన్యత కుదిరింది.అంతకు ముందు పదేళ్ళ నుంచీ ఈ వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ ఒచ్చారు.వంగవీటి రాధా అప్పట్లో కాపు సామాజిక వర్గం నుంచి అదరగొట్టే రాజకీయం చేసారు ఆ తర్వాత, ముద్రగడ పద్మనాభం, జ్యోతుల నెహ్రూ రాజకీయంగా ఎదిగినా.
ఆ తర్వాత, కాలక్రమంలో వారేమీ తమ ఉనికిని చాటుకోలేకపోయారు.
చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంతో మరోమారు రాజకీయాల్లో ‘కాపు సామాజిక వర్గం’పై శ్రద్ధ పెరిగిందనే చెప్పాలి.కాపు సామాజిక వర్గం, చిరంజీవి రాజకీయాల్లో ఉద్ధరించేస్తాడనుకున్నా.ఆ తర్వాత ఉస్సూరుమనక తప్పలేదు.
తాను కుల మతాలకి అతీతం అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెబుతున్నా అందరూ ఆయన్ని కాపు నేతగానే చూస్తున్నారు అనేది కాదనలేని నిజం.
తాజాగా దాసరి నారాయణరావు వై కా పా వైపు మొగ్గు చూపుతూ ఉండడం తో ఎవరికీ వారు కాపుల విషయంలో జాగ్రత్త లు పడుతున్నారు.2016 చివరికల్లా కాపుల రిజర్వేషన్ విషయం లో మొదలైన ప్రక్రియ ని ఒక కొలిక్కి తేవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.మొత్తమ్మీద, రానున్న రోజుల్లో ‘కాపు సామాజిక వర్గం’ పేరు ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సమైన రాజకీయ రచ్చ జరగనుందన్నది నిర్వివాదాంశం.
కాపులకి రిజర్వేషన్ పక్కగా కనిపిస్తోంది ఇవన్నీ చూస్తుంటే .







