" కవితా నీ సంగతి నువ్వు చూసుకోమ్మా "

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు – నిజామాబాద్ ఎంపీ కవిత బీజేపీ తో సవాల్ చేసిన విషయం తెలిసిందే, బీజేపీ నేతలకి చేతనైతే హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం ఇరవై వేల కోట్ల నిథులు తెప్పించాలి అనీ అలా చెయ్యకుండా జీహెచ్ఎంసీ ఎలెక్షన్ లో వారు పాల్గొనకూడదు అని ఆమె సవాలు చేసిన విషయం తెలిసిందే.

 Kavitha Vs Bjp At Ghmc-TeluguStop.com

ఇప్పుడు ఆ ఛాలెంజ్ ఆమెని ఇబ్బందుల్లోకి గురిచేసినట్టు కనిపిస్తోంది.

ఈ విషయం మీద బీజేపీ ఎమ్మెల్సీ యెన్ రామచంద్ర రావు తీవ్రంగా మాట్లాడారు.కవిత ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అని ఆయన అన్నారు.

ప్రభుత్వ లెక్కలు చూసుకునే సమయం లేకపోయినా కనీసం సొంత లెక్కలైనా చూసుకో అంటూ ఆయన తీవ్రంగా మాట్లాడారు.

ఎంపీ కవితకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటు హక్కే లేదని అలాంటప్పుడు ఆమె ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు.

బీజేపీపై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా విరుచుకుపడాలని అనుకుంటే తామేం చేయగలమని వ్యాఖ్యానించారు.తెలంగాణ అభివృద్ధికి బీజేపీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నదని ఈ క్రమంలో సందర్భాన్ని అవసరాన్ని బట్టి నిధులు కేటాయిస్తామని చెప్పారు.కేంద్ర మంత్రి గడ్కరీ తాజా పర్యటనలో రూ.30 వేల కోట్లతో రోడ్లకు శ్రీకారం చుట్టడం ఇందుకు నిదర్శనమన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube