అందంగా కనపడే అమ్మాయిని చూస్తే ఎవ్వరికైనా ‘ఆహేం ఆహేం ‘ అవ్వాల్సిందే.ఆమెని సృష్టించిన బ్రహ్మ దేవుడికే మతి పోయే అమ్మాయిలు కనిపిస్తూ ఉంటారు.
ఆపోజిట్ సెక్స్ ని చూసి సొంగ కార్చడం అబ్బాయిలకి వింతేమీ కాదు.ఆర్ధిక సమానత్వం కూడా అమ్మాయిలు సాగిస్తున్న ఈ క్రమంలో ఇంకా అమ్మాయిలు రెచ్చిపోతున్నారు.
బండి మీద ఒక్కడే వెళుతున్న అబ్బాయి లిఫ్ట్ అడిగితే ఇవ్వని వారు ఎవరు ఉంటారు ? ఆ అమ్మాయి ఆ సమయంలో ఎందుకు ఒక్కత్తీ ఉందీ ఏ ట్రాన్స్ పోర్ట్ ఉన్నా కూడా ఒదిలేసి తననే ఎందుకు అడిగింది, ఆమె ఏమైనా ప్రమాదానికి దారి తీస్తుందా లాంటి ఆలోచన కూడా చూస్కోకుండా లిఫ్ట్ ఇచ్చి వెనక కూర్చో పెట్టుకుని ఆమె తన వీక్ నెస్ మీద దెబ్బకొట్టింది అని తెలుసుకోలేక పోతున్నారు చాలా మంది.అందమైన అమ్మాయిలని వలగా వేసి కొందరు దొంగతనాలు చేస్తున్నారు అని చెబుతున్నారు పోలీసులు.
తమిళనాడుకు చెందిన ఈ ఖిలాడీ గ్యాంగు శ్రీకాళహస్తిలోని ఓ అద్దెంట్లో దిగారట.వీరితో పాటు సత్య అనే అందమైన అమ్మాయి కూడా ఉందట.
ఆమెనే అందo అస్త్రంగా చేసుకుని చుట్టుపక్కల మగాళ్లపై వలపు వల విసిరేయమని చెప్పారు.అలా అమ్మడితో క్లోజ్ అయిన వాళ్లను వాళ్ల ఇళ్లలో చెబుతామని బెదిరించి డబ్బు నొక్కేసేవాళ్లు.
రెండు వారాల క్రితం అలా వాళ్ల చేతికి చిక్కిన శ్రీనివాస్ అనే కుర్రాడు ఎదురుతిరగడంతో అతన్ని హత్య చేశారు.అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వీరిని విచారిస్తే పోలీసులకు ఈ బ్యూటీ గ్యాంగ్ సీక్రెట్ బయటపడిందట.







