సాధారణంగా సినిమా హిట్ అయితే కంగ్రాట్స్ చెబుతారు కానీ తనకి అంతా థాంక్స్ చెబుతున్నారు అనీ ‘నేను శైలజ’ లాంటి సినిమాని జనాలకి ఇచ్చినందుకు గాను ఇలాంటి రెస్పాన్స్ వస్తోంది అని చెబుతున్నారు .“కిషోర్ తిరుమల నేను శైలజ కథ చెప్పినపుడు నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తొచ్చాయి.అలాగే మా పెదనాన్నగారికి కూడా కొన్ని నిజ జీవిత సందర్భాలు కనెక్టయ్యాయి.ఇలా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయిన సినిమా ఇది.అందుకే ఈ సినిమా చూసిన వాళ్లు కంగ్రాట్స్ చెప్పట్లేదు.థ్యాంక్స్ అంటున్నారు.
ఇండస్ట్రీకి కూడా ఈ సినిమాతో మంచి విజయం దక్కింది’’ అన్నాడు రామ్.దేవదాసు సినిమా పక్కన పెడితే అన్నీ తాను చేసినవి ఎంటర్టైనర్ లే అనీ అవే హిట్ అయ్యాయనీ అంటున్నాడు రాం.కందిరీగ తో హిట్ కొట్టిన తరవాత మాస్ సినిమాలు చాలా దెబ్బలు కొట్టాయి అనీ కానీ నేను శైలజ విషయంలో భిన్నంగా వెళ్లి హిట్ కొట్టాను అని గర్వంగా చెప్పుకొచ్చాడు రాం.” మేమేమీ మా సినిమా గురించి బ్లాక్ బస్టర్ అని డప్పుకోట్టుకోవడం లేదు , ఈ సినిమా మంచిగా ఉంది ప్రేక్షకులు ఆదరిస్తున్నారు ఇది చాలు మాకు.కమర్షియల్ గా కూడా బాగా డబ్బులోచ్చాయి ” అనేది రాం వాదన.