మోహన్ బాబు పేరు చెబితే ఆయన డిసిప్లిన్ , ఆయన పీకే క్లాసులే గుర్తుకు వస్తాయి.అందరూ భయపడే మోహన్ బాబు అంటే డైరెక్టర్ రాం గోపాల్ వర్మ కి అసలు లేక్కలేనట్టు గా ఉంది.
ఆయన్ని ఏకంగా ‘గేదె’ అని తిట్టి పాడేసాడు వర్మ.
సంచనలానకి మారు పేరైన వర్మ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో తన ఆహార ఆలవాట్లు గురించి మాట్లాడుతూ మోహన్ బాబు గురించి ప్రస్తావన రాగా మోహన్ బాబు ఎప్పుడు చూసినా షూటింగ్ సెట్ లలో ఎదో ఒక ఆహార పదార్ధాన్ని ఆఫర్ చేస్తూ ఉంటారు అనీ చెప్పుకొచ్చారు.
ఒకసారి ఆమ్లెట్ అని, ఒకసారి స్వీట్ అని, మరోసారి బిర్యాని అని ఏదో ఒకటి ఆఫర్ చేస్తుంటారని, వాటిని గురించి వర్ణిస్తూ ఉంటారని చెప్పారు.ప్రతి 15-20 నిమిషాలకొకసారి ఏదో ఒకటి పెడుతూ ఉంటారని అన్నారు.” నేను అవేమీ తీసుకోక పోవడం తో ఆయన నన్ను విసిగించే వారు, దాంతో నేను ‘ గేదెలూ మేకలూ ఎప్పుడూ తింటూ ఉంటాయి సింహం ఒక్క సారే తింటుంది ‘ అని చెప్పను ” అన్నారు రామూ.
ఆ తరవాత ఆరోగ్య విషయం లో ఇద్దరినీ కంపేర్ చేస్తూ అనారోగ్యం అలసటా తనకి రావు అనీ మోహన్ బాబుకి వస్తాయి అని ప్రస్తావన వచ్చింది అనీ అప్పుడు తాను రుచికోసం తినగూడదని, అది ఆల్కహాల్ కంటే కూడా చాలా దారుణమైన అలవాటని చెప్పారుట.” మీరు గేదలా ఎప్పుడూ తింటూ ఉండడం వల్లనే మీ ఆరోగ్యం పాడవుతోంది ” అనేసారట వర్మ.







