దగ్గరలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ఎలెక్షన్ మీదనే ఇప్పుడు అందరి కళ్ళూ పడ్డాయి.అధికార తెరాస దగ్గర నుంచీ అందరూ వీలైనన్ని సీట్ లు రాబట్టడం కోసం ప్రయత్నాలు యత్నాలూ చేస్తున్నారు.
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్‌టీవీ నీల్సన్ సంస్థతో కలిసి నిర్వహించిన సర్వే ఫలితాలను నిన్న వెలువరించింది.మొత్తం 150 డివిజన్ స్థానాలకు గానూ టీఆర్ఎస్ పార్టీ 75 నుంచి 85 స్థానాలు దక్కించుకుంటుందని పేర్కొంది.
టీడీపీ-బీజేపీ కూటమికి కేవలం 25 నుంచి 35 స్థానాలు మాత్రమే లభిస్తాయని చెప్పింది.ఎంఐఎం పార్టీ 40 నుంచి 45 స్థానాలు వస్తాయని పేర్కొంది.
హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, ఆ పార్టీకి కేవలం 12 లోపు మాత్రమే స్థానాలు లభిస్తాయని చెప్పింది.ఇతరులకు 3 స్థానాలు లభిస్తాయని పేర్కొంది.
సీమాంధ్ర వాసులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లో తెరాస కి పోయిన సారి జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో పెద్ద విజయాలు కూడా పెద్దగా ఏమీ లభించలేదు.కానీ ఈ సర్వే మాత్రం వారికి అనుకూలంగా ఉంది.







