రోజా సస్పెన్షన్ విషయంలో వైకాపా వరసగా తప్పటడుగులు వేసి చాలా ఇబ్బందికర పరిస్థితి తెచ్చుకుంది.గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకొంటే, తెదేపా కూడా అధికార పార్టీ అనే అహం ప్రదర్శించి చిన్న సమస్యను పెద్ద సమస్యగా చేసుకొని విమర్శలు మూటగట్టుకొంది.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు తో రోజా సభలోనే చాలా అనుచితంగా మాట్లాడారు అనేది చాలా పెద్ద తప్పు.ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేసినా ఆమె బాధపడ్డం లేదు అని మరొక వ్యాఖ్య చేసి ఇంకొక పెద్ద తప్పు చేసారు అని చెబుతున్నారు.
తప్పు చేసి తప్పుకి సంబంధించి క్షమాపణ కోరడం మానేసి నాకు ఏం పరవాలేదు అనడం మరింత గా జనాల్లోకి తప్పుడు సమాచారం పంపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు.వరుసపెట్టి ఇన్ని తప్పులు చేసిన తరువాత ఈ సమస్య నుండి ఏవిధంగా బయటపడాలో వైకాపాకి కూడా అర్ధం కావడం ఇప్పుడు.
మరొక పక్క స్పీకర్ కూడా ముఖ్యమంత్రి పట్ల తప్పుగా మాట్లాడినప్పుడు ఎదో ఒక శిక్ష వెయ్యాలి కానీ ముందూ వెనకా ఆలోచించకుండా ఏకంగా ఏడాది సస్పెన్షన్ విధించేసారు దీనివలన రోజా లాంటి వ్యక్తిని బయటకి పంపిస్తూ నే లోపల ఉన్న గడుసు జనాలకి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యింది.ఒక రకంగా క్రమ శిక్షణ చర్య కంటే కూడా ప్రతిపక్షాన్ని తోక్కేస్తున్నారు అనే సిగ్నల్స్ బయటకి వెళ్ళాయి కూడా.
ఇలాంటి పరిస్థితి లో తెదేపా నలుగురు సభ్యులతో ఈ విషయమై ఒక కమిటీని నియమించింది.ఈ కమిటీలో తెదేపా తరపున ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, బీజేపీ తరపున విష్ణు కుమార్ రాజు, వైకాపా తరపున శ్రీకాంత్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.
నలుగురిలో ఒక్క శ్రీకాంత్ రెడ్డి తప్ప మిగిలిన ముగ్గురు కూడా స్పీకర్ నిర్ణయాన్ని సమర్ధించడం తధ్యం.సో ఏదైతేనే స్పీకర్ నిర్ణయం సరైనదే అని ఈ కమిటీ సిఫార్సు చెయ్యబోతోంది.
తెదేపా చాలా తెలివిగా ప్రవర్తించింది అలాగే వైకాపా కూడా ప్రవర్తించి ఉంటే బాగుండేది, రాజకీయం ఇంకా నేర్చుకోవాలేమో జగన్ గారు ముఖ్యంగా తన ప్రత్యర్ధి చంద్రబాబు గారి దగ్గర.







