ఓంకార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రాజు గారి గది’ చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే.పెట్టిన పెట్టుబడికి ఏకంగా మూడు రెట్ల కలెక్షన్స్ వచ్చాయి.
అంత పెద్ద సక్సెస్‌ను అందుకున్న చిత్రానికి సీక్వెల్ చేయాలని ఓంకార్ నిర్ణయించుకున్నాడు.చిత్రం విడుదల అయిన వెంటనే సీక్వెల్‌పై ప్రకటన ఇచ్చిన విషయం తెల్సిందే.
ప్రస్తుతం ఓంకార్ సీక్వెల్ కోసం స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడు.ఈసారి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంగా హర్రర్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.
ఈ సీక్వెల్ కోసం ఓంకార్ తెలుగు ముద్దుగుమ్మ అంజలిని సంప్రదించాడట.హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు అన్నా, హర్రర్ చిత్రాలు అంటే అమితంగా ఆసక్తి చూపించే అంజలి వెంటనే ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇప్పటికే ఓంకార్ రెడీ చేసిన స్క్రిప్ట్‌ను ముద్దుగుమ్మ అంజలి విని ఓకే చేసిందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.‘రాజు గారి గది 2’లో అంజలి సందడి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచక జరిగి పోతున్నాయి.
తాజాగా ఈమె ‘డిక్టేటర్’ చిత్రంలో నటించింది.సంక్రాంతికి ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మార్చిలో ఈ సీక్వెల్ కోసం రాజుగారి గదిలో అంజలి అడుగు పెట్టబోతున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.







