యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉంది.
ఇప్పటికే ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది.ఫస్ట్‌లుక్ నుండి కూడా ఇప్పటి వరకు ఒక్కో పోస్టర్‌తో అంచనాలను పెంచేస్తూనే ఉన్నారు.
విడుదలైన ప్రతి పోస్టర్‌లో కూడా ఎన్టీఆర్ మరింత స్టైలిష్ లుక్‌తో కనిపిస్తున్నాడు.నిన్న చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసిన ఈ పోస్టర్ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తుంది.
ఎన్టీఆర్ ఈ చిత్రంలో స్టైలిష్‌గా కనిపిస్తాడు అంటూ ఇప్పటికే పోస్టర్ల ద్వారా తెలిసింది.అలాగే థియేట్రికల్ ట్రైలర్ ద్వారా కూడా ఎన్టీఆర్ లుక్ గురించి ఒక క్లారిటీ వచ్చింది.
అయినా కూడా ఫ్యాన్స్ పూర్తి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎన్టీఆర్ లుక్ కోసం ఈ చిత్రాన్ని చూడాలని అనుకునే వారి సంఖ్య భారీగానే ఉంది.
తన లుక్స్‌తో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్న ఎన్టీఆర్ మరోసారి సంక్రాంతికే వస్తాను అంటూ తేల్చి చెప్పాడు.ఈనెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
సుకుమార్ దర్శకత్వంలో బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.







