ఇటీవల వచ్చిన చిత్రాల్లో క్లైమాక్స్ అత్యధికంగా ఆకట్టుకున్న చిత్రాల్లో ‘అత్తారింటి దారేది’ చిత్రం ముందు ఉంటుంది.ఆ చిత్రం ఎమోషన్ సీన్స్‌తో పవన్ మరియు త్రివిక్రమ్ ఆకట్టుకున్నాడు.
ఆ స్థాయిలో మరే సినిమా క్లైమాక్స్ రాలేదు అంటూ సినీ వర్గాల వారు సైతం అంటున్నారు.అయితే త్వరలో రాబోతున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం క్లైమాక్స్ మాత్రం ‘అత్తారింటికి దారేది’ చిత్రం క్లైమాక్స్‌ను మించేలా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.సుకుమార్ దర్శకత్వంలో బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.తాజాగా ఈ చిత్ర ఆడియో విడుదల సందర్బంగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.ఇక ఈ సినిమా క్లైమాక్స్ ‘అత్తారింటికి దారేది’ చిత్రంను మించి ఉంటుందనే ప్రచారం రావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా వస్తున్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు మరియు రాజేంద్ర ప్రసాద్‌లు ముఖ్య పాత్రల్లో నటించారు.







