ఈ వయస్సులోనూ అదరగొట్టాడు

నందమూరి బాలకృష్ణ 55వ సంవత్సరంలో కూడా యువ స్టార్‌ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు.‘లెజెండ్‌’ చిత్రంతో 50 కోట్ల మార్క్‌ను చేరిన బాలయ్య బాబు తాజాగా నటిస్తున్న ‘డిక్టేటర్‌’ చిత్రంతో యువ స్టార్‌ హీరోలకు మరోసారి సవాల్‌ విసిరాడు.

 Balayya Dictator Record Pre-release Business-TeluguStop.com

తాజాగా ఈయన నటిస్తున్న ‘డిక్టేటర్‌’ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.బాలకృష్ణ 99వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై సినీ జనాల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది.

దాంతో పలువురు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఏకంగా 40 కోట్లను దాటినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

‘లయన్‌’ సినిమాతో బాలయ్యకు చేదు అనుభవం ఎదురైంది.అయినా కూడా బాలయ్యపై నమ్మకంతో పాటు శ్రీవాస్‌ సక్సెస్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో ‘డిక్టేటర్‌’ను భారీ మొత్తానికి కొనుగోలు చేస్తున్నారు.30 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను శ్రీవాస్‌ పూర్తి చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.విడుదలకు ముందే నిర్మాతలకు 10 కోట్ల టేబుల్‌ ప్రాఫిట్‌ను ‘డిక్టేటర్‌’ సాధించి పెట్టాడు.

విడుదల తర్వాత ఏమాత్రం సక్సెస్‌ టాక్‌ తెచ్చుకున్నా కూడా తప్పకుండా ఈ సినిమా 40 కోట్లకు పైగా వసూళ్లను రాబడుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు.ఈ చిత్రంలో అంజలి మరియు సొనాల్‌ చౌహాన్‌లు నటిస్తున్న విషయం తెల్సిందే.

ఆడియోను ఈనెల 20న విడుదల చేయబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube