ఇటీవలే విడుదలైన ‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో హెబ్బా పటేల్‌కు స్టార్ హోదా దక్కింది.ఒక్క సినిమాతో ఓవర్‌నైట్‌లో స్టార్ అయిన హెబ్బా పటేల్‌కు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
ఈమెతో నటించేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు.ఈ క్రమంలో ఈమెతో తమ షాపింగ్ మాల్స్‌ను ఓపెనింగ్ చేయించేందుకు వ్యాపారస్తులు ఆసక్తి చూపుతున్నారు.
‘కుమారి 21ఎఫ్’ చిత్రం విడుదల తర్వాత ఈమెకు భారీ డిమాండ్ పెరిగింది.ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది.
తాజాగా అదే ఈమెకు ఇబ్బందిని తెచ్చి పెట్టింది.తాజాగా ఈమె కాకినాడలో ఒక షాపింగ్ మాల్‌ను ఓపెన్ చేసేందుకు వెళ్లింది.
ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పూర్తిగా గ్రహించలేక పోయిన షాపు యాజమాన్యం తక్కువ భద్రతను కల్పించారు.ముగ్గురు నలుగు ఉన్న సెక్యురిటీ సిబ్బంది ఆమెను జనాల నుండి కాపాడటంలో విఫలం అయ్యారు.
మాల్ ఓపెనింగ్‌కు వచ్చిన హెబ్బా పటేల్ కారు దిగగానే పెద్ద ఎత్తున జనాలు ఆమెపైకి వెళ్లబోయారు.దాంతో సెక్యూరిటీ సిబ్బంది లాఠీ చార్జ్ చేసినా కూడా అదుపులోకి రాలేదు.
ఆ జనాల్లో హెబ్బాకు చేదు అనుభవం ఎదురైంది.అనేక మంది ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.
దాంతో షాక్ అయిన హెబ్బా పటేల్ కార్యక్రమం మద్యలోనే వెళ్లి పోయినట్లుగా తెలుస్తోంది.ఈ సంఘటనతో హెబ్బా పటేల్ పబ్లిక్ ఈవెంట్స్ అంటే ఆందోళన చెందుతుంది.







